Peddi OTT Release: రూ.400 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమా కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న ఓటీటీ విడుదల తేదీ కూడా అధికారికంగా వచ్చేసింది.
రామ్ చరణ్ నటించిన పాన్-ఇండియా సినిమా 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా ఇది నిలిచింది.
25
బుచ్చి బాబు సానా దర్శకత్వం
డైరెక్టర్ బుచ్చి బాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వెంకట్ సతీష్ కిలారు నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించిన ఈ భారీ బడ్జెట్ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తమిళనాడు, కేరళలో థింక్ స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేసింది.
35
రామ్ చరణ్ నటన అతిపెద్ద బలం
ఈ సినిమాకు రామ్ చరణ్ నటన అతిపెద్ద బలంగా నిలిచింది. పాత్ర కోసం ఆయన పడిన కష్టం, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, ఎమోషనల్ యాక్టింగ్.. అభిమానులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో నటించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
ఈ విజయం రామ్ చరణ్ కెరీర్‌లో అతిపెద్ద సోలో హిట్‌గా నిలిచింది. ఇండియాలో మాత్రమే ఈ సినిమా సుమారు రూ.287 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
55
ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందా
యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్పోర్ట్స్, థ్రిల్ వంటి ఎన్నో అంశాలతో తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో వసూళ్ల రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందా అనే ఆసక్తి అభిమానులలో పెరిగింది.