Naga Chaitanya: కోరిన డైరెక్టర్ ని చిటికెలో సెట్ చేసే సత్తా నాన్నకు ఉంది, కానీ అలా వద్దు.. చైతూ కామెంట్స్

Published : Jul 05, 2026, 06:55 PM IST

నాగ చైతన్య, అఖిల్ నాగార్జున తనయులు అయినప్పటికీ అగ్ర దర్శకులతో సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి నాగ చైతన్య ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 

PREV
15
అక్కినేని నాగ చైతన్య

హీరోలకు మంచి సక్సెస్ దక్కాలి అంటే మంచి దర్శకుడు అవసరం. అందుకే హీరోలంతా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుంటారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలి అంటే హీరోలు చాలా విషయాలు పరిశీలిస్తారు. అదే ఫేమ్ ఉన్న దర్శకుడు అయితే వెంటనే ప్రాజెక్ట్ ఓకె చేసేస్తారు. ఇండస్ట్రీని శాసించే కొన్ని కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఉంటుంది.

25
నాగార్జున తనయులు

కానీ నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ లకు ఇంతవరకు భీకరమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టే సినిమా ఒక్కటి కూడా పడలేదు. అలాంటి దర్శకులతో వాళ్ళు సినిమాలు చేయకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. దీనికి తోడు చైతు, అఖిల్ కి గతంలో వరుసగా ఫ్లాపులు పడ్డాయి. ఆ టైంలో నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
నాన్నకు ఒక్క మాట చెబితే చాలు

నాగార్జున గారు ఇండస్ట్రీలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరు. అలాంటి నాగార్జున గారి తనయులు మీరు. మీ కోసం నాగార్జున గారు ఎందుకు స్టార్ డైరెక్టర్లని తీసుకురావడం లేదు, భారీ ప్రాజెక్ట్స్ ఎందుకు సెట్ చేయడం లేదు అని అభిమానులు అడుగుతున్నారు అంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి చైతు సమాధానం ఇస్తూ.. బయట అభిమానులు అలా అనుకుంటున్నారేమో. కానీ అది నిజం కాదు. నేను నాన్నకు జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు లేదా నాన్నతో టిఫిన్ చేస్తూ మాట్లాడితే చాలు.. నేను ఏ డైరెక్టర్ ని అడిగితే ఆ డైరెక్టర్ ని నాన్న వెంటనే సెట్ చేయగలరు.

45
మాకు సొంతంగా ఎదగడమే ఇష్టం

కానీ నేను, అఖిల్ ఇంతవరకు నాన్నని ఆ విధంగా అడగలేదు. ఆ డైరెక్టర్ కావాలి, అంత పెద్ద ప్రాజెక్ట్ కావాలి అని నాన్నని మేము ఎప్పుడూ అడగలేదు. వీలైనంత వరకు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సొంతంగా ఎదగాలి అనే ఆలోచన ఉంది. అయినప్పటికీ ఫ్యామిలీ నుంచి ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది. మేము కూడా మా సొంత మార్క్ క్రియేట్ చేసుకోవాలి అని ప్రయత్నిస్తున్నాం. అందుకే నాన్నని అడిగి ఎప్పుడూ ప్రాజెక్ట్ కానీ, దర్శకుడిని కానీ సెట్ చేసుకోలేదు అంటూ నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు.

55
వాటివల్ల ఎదురుదెబ్బ

మాకు ఇప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి కాబట్టి అభిమానులు నిరాశలో అలా మాట్లాడుతూ ఉండొచ్చు. ఇందులో నాన్న తప్పు ఏమాత్రం లేదు. మేము సొంతంగా ఎదగాలని కొన్ని సినిమాలు చేశాం. వాటివల్ల ఎదురుదెబ్బ తగిలింది అని నాగ చైతన్య తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories