Chiranjeevi: హిందీ సినిమా చేస్తూ నువ్వు మా తమ్ముడిలా ఉన్నావ్ అని చెప్పిన చిరు..ఆ హీరో దశ తిరిగింది

Published : Jul 05, 2026, 04:21 PM IST

Chiranjeevi: చిరంజీవి ఓ హిందీ సినిమాలో నటిస్తున్న సమయంలో ఒక నటుడిని చూసి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో పోల్చారు. చిరంజీవి కామెంట్స్ కి ఆ నటుడు ఆశ్చర్యపోయారట. 

PREV
15
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు హిందీలో కూడా నటించారు. ప్రతిబంధ్, ఆజ్ కా గూండారాజ్ లాంటి సినిమాలని చిరంజీవి బాలీవుడ్ లో చేశారు. అయితే ఆ చిత్రాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అయితే ఆజ్ కా గుండా రాజ్ చిత్ర షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

25
హిందీ సినిమాలో రవితేజ

1992లో అజ్ కా గుండా రాజ్ చిత్రం తెరకెక్కింది. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రం గ్యాంగ్ లీడర్ కి ఇది హిందీ రీమేక్. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించారు. అప్పటికి రవితేజ స్టార్ కాలేదు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ముంబై వెళ్లి బాలీవుడ్ ఛాన్సుల కోసం రవితేజ ట్రై చేశారు. ఆ టైంలో ఆజ్ కా గుండా రాజ్ చిత్రం లో చిరంజీవి స్నేహితుడి పాత్రలో అవకాశం దక్కింది. ఈ విషయాన్ని రవితేజ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

35
నువ్వు మా తమ్ముడిలా ఉన్నావ్

ఒక రోజు షూటింగ్ లో చిరంజీవి గారు పిలిచి నువ్వు మా బ్రదర్ పవన్ కళ్యాణ్ లా ఉన్నావు అని అన్నారు. అప్పట్లో నా హెయిర్ స్టైల్, పవన్ హెయిర్ స్టైల్ కొంచెం ఒకేలా ఉండేవి. ఆ మాట నాకు కొండంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని రవితేజ తెలిపారు.

45
ఆ మాట కాన్ఫిడెన్స్ ఇచ్చింది

చిరంజీవి లాంటి వ్యక్తి నన్ను గుర్తించి వాళ్ళ బ్రదర్ తో పోల్చారు అంటే ఎంతోకొంత ప్రత్యేకత ఉన్నట్లే కదా అనే నమ్మకం తనలో ఏర్పడినట్లు రవితేజ తెలిపారు.

55
తిరుగులేని హీరోగా రవితేజ

ఆ తర్వాత రవితేజ తిరిగి టాలీవుడ్ కి వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించారు. కాస్త ఆలస్యం అయినప్పటికీ రవితేజ టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంతో హీరోగా హిట్ అందుకోగా.. ఇడియట్ చిత్రంతో రవితేజ స్టార్ అయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories