రాంచరణ్, బుచ్చిబాబు, రెహమాన్ ముగ్గురితో.. జానీ మాస్టర్ కి ఇంతకి మించిన గోల్డెన్ ఛాన్స్ ఉండదు

Published : Aug 27, 2025, 08:50 PM IST

వినాయక చవితి సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ది చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మైసూరులో ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ జరుగుతోంది. 

PREV
15

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రాంచరణ్ తొలిసారి నటిస్తున్న చిత్రం ఇది. పీరియాడిక్ కథాంశంతో, ఉత్తరాంధ్ర నేపథ్యంలో బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

25

గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా అని వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో రాంచరణ్ నట విశ్వరూపం ప్రదర్శించబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. టీజర్ కూడా ఒక రేంజ్ లో వైరల్ గా మారింది. వినాయక చవితి సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్రంపై ఒక రేంజ్ లో హైప్ ఇచ్చే అప్డేట్ ఇచ్చారు.

35

మైసూరు లో పెద్ది చిత్ర సాంగ్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇది రాంచరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని అంటున్నారు. బుచ్చిబాబు ట్విట్టర్ లో.. రెహమాన్ డబ్బు.. రాంచరణ్ స్టెప్పు.. నన్ను నమ్మండి ఇది మెగా పవర్ స్టార్ బ్లాస్ట్.. రత్నవేలు విజువల్ మ్యాజిక్ చూస్తారు. సాంగ్ షూటింగ్ మొదలైంది.. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని బుచ్చిబాబు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో బుచ్చిబాబు, రాంచరణ్, ఇతర చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ జోష్ లో కనిపిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతున్న వీడియో కూడా ఉంది. 

45

ఆస్కార్ విన్నర్ రెహమాన్.. రాంచరణ్ ఇంట్రడక్షన్ కోసం ఎనర్జిటిక్ మాస్ నంబర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. జానీ మాస్టర్ ఇటీవల లైంగిక వేధింపుల కేసులో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంత పెద్ద వివాదం తర్వాత ఎవరి కెరీర్ అయినా ఎఫెక్ట్ అవుతుంది అనే సందేహాలు ఉంటాయి. 

55

స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వడానికి జానీ మాస్టర్ కి ఇది మంచి అవకాశం. రాంచరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్, రత్నవేలు కాంబినేషన్ లో రూపొందే సాంగ్ కి కొరియోగ్రఫీ అందించడం అంటే గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ సాంగ్ లో 1000 మంది డ్యాన్సర్లు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories