మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా సక్సెస్ ని రాంచరణ్ గేమ్ ఛేంజర్ తో కొనసాగించలేకపోయారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు పెద్ది సినిమాపైనే అభిమానుల అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో అయినా చరణ్ తిరిగి పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటాడు అని భావిస్తున్నారు.
25
చికిరి సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్
ఇప్పటి వరకు బయటకు వచ్చిన పెద్ది ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఆకట్టుకుంది. టీజర్ అదిరిపోయింది. ఆ తర్వాత వచ్చిన చికిరి సాంగ్ అయితే యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
35
రిలీజ్ డేట్ పై అనుమానాలు
ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. ఆ దిశగానే చిత్ర యూనిట్ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తోంది. అయితే కొన్ని కథనాల ప్రకారం పెద్ది చిత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం మార్చి 27నే రిలీజ్ చేయనున్నట్లు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
ఏది ఏమైనా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే పెద్ది మూవీ ఫస్ట్ హాఫ్ ని డైరెక్టర్ బుచ్చిబాబు లాక్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసి బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ఏఆర్ రెహమాన్ కి ఇచ్చారట.
55
అంతా ఆయన చేతుల్లోనే
రిలీజ్ కి ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ది ఫస్ట్ హాఫ్ ని గూస్ బంప్స్ తెప్పించే విధంగా రూపొందించినట్లు టాక్. ఏఆర్ రెహమాన్ తన బిజియంతో ఏ స్థాయికి తీసుకుని వెళతారో చూడాలి. అదే విధంగా సెకండ్ హాఫ్ ఎడిటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు ముందు నుంచి ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు.