రాంచరణ్ పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ రిలీజ్ అయింది. జస్ట్ ప్రోమోలోనే రాంచరణ్ తన డ్యాన్స్ తో ఇంటర్నెట్ ని ఊపేశారు. ఇప్పుడు కంప్లీట్ సాంగ్ వచ్చేసింది. మరి పాట ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్, మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
25
చికిరి సాంగ్ వచ్చేసింది
పెద్ది మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఆడియన్స్ లో బాగా క్లిక్ అవుతోంది. ఫస్ట్ లుక్ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ లో రాంచరణ్ క్రికెట్ షాట్ కొట్టే విధానం దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. రీసెంట్ గా ఈ చిత్రంలో చికిరి అనే ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. సాంగ్ ప్రోమోలో రాంచరణ్ బీడీ కాల్చుతూ వేసిన స్టెప్ కి ఫ్యాన్స్ ఊగిపోయారు. తాజాగా చికిరి కంప్లీట్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
35
రెహమాన్ డిసప్పాయింట్ చేయలేదు
ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే భారీ అంచనాలు ఉంటాయి. పైగా రాంచరణ్ పాన్ ఇండియా మూవీకి రెహమాన్ సంగీతం అని తెలియగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి. టీజర్ లో మస్సా మస్సా అంటూ ఆస్కార్ విన్నర్ ఇచ్చిన బీజీయం బాగా ఆకట్టుకుంది. దీనితో చికిరి సాంగ్ ఎలా ఉంటుందో అనే అంచనాలు ఫ్యాన్స్ లోఏర్పడ్డాయి. మొత్తానికి సాంగ్ వచ్చేసింది. ఊహించినట్లుగానే ఏఆర్ రెహమాన్ డిసప్పాయింట్ చేయలేదు. కిరాక్ అనిపించే బీట్ తో సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు.
బీడీ కాల్చుతూ, బ్యాట్ పట్టుకుని రాంచరణ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా చేస్తున్న డ్యాన్స్ అదిరిపోయింది. చరణ్ డ్యాన్స్ చేస్తుంటే ఏదో స్టెప్పులు వేస్తున్నట్లు లేదు.. నేచురల్ గా ఆ పాత్రలో ఒదిగిపోయినట్లు అనిపిస్తోంది. తన ప్రియురాలి అందాన్ని వర్ణిస్తూ తన స్నేహితులతో కలిసి పెద్ది ఈ పాటని పడుతున్నాడు. బుచ్చిబాబు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అందిస్తూనే ఆ రూరల్ బ్యాక్ డ్రాప్ ఫీలింగ్ మిస్ కాకుండా చూసుకున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. జాన్వీ కపూర్ తన గ్లామర్ తో ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ లో ఆమె గ్లామర్ కూడా ఒక హైలైట్ అనే చెప్పాలి.
55
మూడూ పర్ఫెక్ట్ సింక్ లో కుదిరాయి
ఈ సాంగ్ లో రాంచరణ్ పెర్ఫార్మెన్స్, జాన్వీ గ్లామర్, రెహమాన్ మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్ సింక్ లో కుదిరాయి. ఈ పాటని ప్రముఖ సింగర్ మోహిత్ చౌహాన్ అద్భుతంగా పాడారు. ప్రముఖ లిరిసిస్ట్ బాలాజీ సాహిత్యం అందించారు.