మెగా ఫ్యాన్స్ లో కలవరం.. పెద్ది కి ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే కష్టమే..

Published : Sep 23, 2025, 01:12 PM IST

Ram Charan - Peddi : ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆచార్య, గేమ్ ఛేంజర్ ఫ్లాప్స్ మెగా అభిమానులను నిరాశపరిచాయి. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్దిలో డ్యూయల్ రోల్ చేస్తున్న చెర్రీపై అందరి దృష్టి ఉంది.

PREV
16
గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత మగధీర సినిమాతో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాశారు. ఈ బ్లాక్‌బస్టర్ హిట్ తో ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకదానికొకటి విభిన్నమైన పాత్రలు చేస్తూ, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో RRRమూవీ అంతర్జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు సినిమాకే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా రామ్ చరణ్ తన ప్రతిభను నిరూపించుకున్నారు.

26
గేమ్ ఛేంజర్ తో నిరాశ

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆచార్య ఘోర ఫ్లాప్‌గా మారింది. ఆ తరువాత వచ్చిన గేమ్ ఛేంజర్ కూడా పెద్దగా అంచనాలు చేరుకోలేకపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందారు. నత్తనడక ప్రమోషన్స్, వీక్ ట్రైలర్, ఆకట్టుకోని పాటలు కారణంగా సినిమా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. మొదటి రెండు రోజులు ఓకే అనిపించినా, సంక్రాంతి పోటీలో నిలబడలేక చివరికి సైలెంట్ అయిపోయింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన గేమ్ ఛేంజర్ ఫైనల్ రన్‌లో ₹100 కోట్ల షేర్ కూడా రాబట్టలేక డిజాస్టర్‌గా మారింది. అయితే సినిమాకు అంత చెడ్డ టాక్ రాకపోయినా, "కొన్ని సీన్లు తీసేస్తే బాగుండేది" అని ప్రేక్షకులు కామెంట్ చేశారు.

36
పెద్ది పై భారీ అంచనాలు

ఇలాంటి సమయంలో రామ్ చరణ్ “పెద్ది” తో త్వరలో రాబోతున్నారు. "ఉప్పెన" వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా, కంటెంట్ పరంగా చాలా కొత్తగా ఉంటుందని సినిమా యూనిట్ చెబుతోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటులు జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ కాస్టింగ్‌నే చూసి ఫ్యాన్స్ ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉండబోతుందని అంచనా వేస్తున్నారు.

46
డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్

ఇదిలా ఉంటే.. పెద్ది సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ఈ వార్త మెగా ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నా, అదే సమయంలో మెగా ఫ్యాన్స్ ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే, రామ్ చరణ్ గత సినిమా “గేమ్ ఛేంజర్”లో కూడా డ్యూయల్ రోల్ చేశారు. కానీ, దాదాపు 400 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. స్టోరీ అంతా ఆట్రాక్టివ్ లేకపోవడంతో పాటు, క్యారెక్టర్ డెవలప్మెంట్ సరిగా లేకపోవడం వల్ల సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అంతేకాదు, సోషల్ మీడియాలో రామ్ చరణ్‌పై దారుణమైన ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంది.

56
మెగా ఫ్యాన్స్ లో ఆందోళన

గేమ్ ఛేంజర్ సినిమాలో డ్యూయల్ రోల్ ప్రయోగం తేడా కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ డ్యూయల్ రోల్ చేయడం కొంతమంది అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. "గేమ్ ఛేంజర్"లో ఎదురైన పరిస్థితులు మరోసారి "పెద్ది"లో వస్తే ఏమవుతుందో? అని మెగా అభిమానులు భయపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. " అల్రెడీ ఒక్కసారి ఫెయిల్ అయినా ఎక్స్‌పెరిమెంట్‌ను మళ్లీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు?" అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

66
బుచ్చిబాబు పైనే భారం

మరోవైపు అభిమానులలో కొందరు మాత్రం బుచ్చిబాబు డైరెక్షన్ పై పూర్తి నమ్మకం ఉంచుతున్నారు. "ఉప్పెన"లో సాధారణమైన లవ్ స్టోరీని కూడా ఎంత ఎమోషనల్‌గా మలిచారో చూసిన తర్వాత, రామ్ చరణ్ కెరీర్‌లో కూడా ఒక పెద్ద మలుపు ఇవ్వగలరని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం కొత్తదనాన్ని ఇస్తుందని, అందులో డ్యూయల్ రోల్ కూడా బలమైన స్క్రీన్‌ప్లేతో వస్తే తప్పకుండా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు. అసలైన సవాలు మాత్రం రామ్ చరణ్ కోసం ఇప్పుడు మొదలైంది. "గేమ్ ఛేంజర్"లోని విఫలమైన ప్రయత్నాన్ని "పెద్ది"లో సక్సెస్‌ఫుల్‌గా మార్చగలరా? అన్నది చూడాలి. ఈ సినిమా విజయం సాధిస్తే చెర్రీ కెరీర్ మళ్లీ పీక్స్ కు చేరుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, గేమ్ ఛేంజర్ లాగే "పెద్ది" కూడా ఫ్లాప్ అయితే మాత్రం రామ్ చరణ్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా, "పెద్ది" సినిమాపై అందరి దృష్టి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories