దేశం పాన్ ఇండియా మోజులో ఊగిపోతుంటే సౌత్ స్టార్స్ డామినేట్ చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన హీరోలుగా టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ హీరోలు అవతరించారు. ఈ జనరేషన్ స్టార్స్ లో ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన బాహుబలి సిరీస్తో వందల కోట్ల వసూళ్లు సాధించాడు.
ప్రభాస్ తర్వాత సౌత్ నుండి యష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేరారు. మరి ఈ కేటగిరీలో టాప్ లో ఉంది ఎవరు? టాప్ టెన్ స్టార్స్ ఎవరనే సర్వే నిర్వహించడం జరిగింది. ఇండియా వైడ్ గా ఆడియన్స్ అభిప్రాయాల ఆధారంగా టాప్ టెన్ పాన్ ఇండియా స్టార్స్ ఎవరో చూద్దాం...
28
Top Ten Pan India Stars
ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ ప్రతి నెలా సెర్వే నిర్వహిస్తుంది. ఈ సంస్థ సర్వే ప్రకారం ఆగస్టు 2022కి గాను నంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా కోలీవుడ్ హీరో విజయ్ ఎంపికయ్యారు. గత కొన్ని నెలలుగా విజయ్ టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా విజయ్ ఈ స్థాయి పాపులారిటీ సంపాదించడం విశేషం.
38
Top Ten Pan India Stars
ఇక రెండో స్థానం ప్రభాస్ కి దక్కింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. సాహో కనీసం హిందీలో హిట్ అయ్యింది. రాధే శ్యామ్ మాత్రం టోటల్ డిజాస్టర్ అని చెప్పాలి. అయినప్పటికీ ప్రభాస్ మేనియా తగ్గలేదు. ఆయనకు పాన్ ఇండియా స్టార్ లిస్ట్ లో 2వ ర్యాంక్ దక్కింది.
48
Top Ten Pan India Stars
ఆర్ ఆర్ ఆర్ తో తన రేంజ్ పెంచుకున్న ఎన్టీఆర్ 3వ స్థానం కైవసం చేసుకున్నారు. విజయ్, ప్రభాస్ ల తర్వాత అత్యంత పాపులారిటీ ఉన్న పాన్ ఇండియా హీరోగా నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్ టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న క్రమంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
58
Top Ten Pan India Stars
కాగా పుష్ప మూవీతో సంచలన విజయం నమోదు చేసిన అల్లు అర్జున్ కి ప్రేక్షకులు 4వ ర్యాంక్ కట్టబెట్టారు. హిందీలో పుష్ప 100 కోట్లకు పైగా వసూళ్లతో అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ మూవీలోని అల్లు అర్జున్ మాస్ మేనరిజమ్స్ వైరల్ అయ్యాయి.
68
Top Ten Pan India Stars
టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న మరొక సౌత్ హీరో యష్. ఈ కన్నడ స్టార్ కెజిఎఫ్ 2 తో ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. బాలీవుడ్ లో ఈ మూవీ అతిపెద్ద విజయం నమోదు చేసింది. కెజిఎఫ్ 2 వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యష్ పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో 5వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.
78
Top Ten Pan India Stars
అనూహ్యంగా రామ్ చరణ్ టాప్ ఫైవ్ నుండి టాప్ టెన్ కి పడిపోయాడు. రామ్ చరణ్ కి 7వ ర్యాంక్ దక్కింది. మరో టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ కూడా ఈ లిస్ట్ లో అంతగా ప్రభావం చూపలేదు. అయితే ఒక్క పాన్ ఇండియా మూవీలో నటించకున్నా ఆయనకు టాప్ టెన్ లో చోటు దక్కింది. మహేష్ కి ఆడియన్స్ 8వ ర్యాంక్ కట్టబెట్టారు. అనూహ్యంగా పవన్ కి ఈ లిస్ట్ లో చోటు దక్కలేదు.
88
Top Ten Pan India Stars
ఇక టాప్ టెన్ లో ఉన్న హీరోలను గమనిస్తే... బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి 6వ ర్యాంక్ దక్కింది. ఈ లిస్ట్ లో ఉన్న ఒకేఒక బాలీవుడ్ హీరో అక్షయ్ కావడం విశేషం. గతంలో ఈయన టాప్ ఫైవ్ లో ఉన్నారు. నటుడు సూర్యకు 9వ ర్యాంక్, అజిత్ కుమార్ కి 10వ ర్యాంక్ దక్కాయి.