షాకింగ్.. ఆ సినిమాలో రాంచరణ్ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ అని తెలుసా.. అసలు నమ్మశక్యం కాదు..

First Published Apr 18, 2024, 4:28 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో చరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో చరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఒక్కో మెట్టూ ఎదుగుతున్నాడు. చిరంజీవి వారసత్వానికి అనుగుణంగా చరణ్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

రాంచరణ్ కెరీర్ లో రంగస్థలం చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ చిత్రంలో రాంచరణ్ నట విశ్వరూపం చూడొచ్చు. డైరెక్టర్ సుకుమార్ విజన్ కి అనుగుణంగా నటిస్తూ చరణ్ అందరి హృదయాలు గెలుచుకున్నాడు. అయితే ఈ చిత్రంలో రాంచరణ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేసారు. 

సుకుమార్ చెప్పిన విషయం ఏంటో తెలిస్తే అసలు నమ్మశక్యం కాదు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ సుకుమార్ ని ప్రశ్నిస్తూ.. రాంచరణ్ లాంటి మాస్ హీరోకి అతి సాధారణంగా సైకిల్ తొక్కుతూ కనిపించే ఇంట్రడక్షన్ సీన్ పెట్టారు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారనే భయం వేయలేదా అని ప్రశ్నించారు. సుకుమార్ బదులిస్తూ.. ఈ కథ అనుకున్నప్పుడు రాంచరణ్ మాస్ హీరో కాబట్టి ఫైట్, పెద్ద బిల్డప్ తో సీన్ పెట్టాలని నా మైండ్ లోకి కూడా రాలేదు. 

కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా. ఆ సీన్ లో గస పెడుతూ హావభావాలు కనిపించాలి అందుకు తగ్గట్లుగానే చేసాం అని సుకుమార్ అన్నారు. ఆ సీన్ షూట్ చేయడానికి ఎన్ని టేకులు అవసరం అయ్యాయి అని ప్రశ్నించగా.. సుకుమార్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. 

లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం. నాలుగైదు టేకులు చేశాం. కానీ నేను అనుకున్నట్లుగా కెమెరా టాప్ నుంచి చరణ్ ఫేస్ వద్దకి రావడం లేదు. కాబట్టి ఆ సీన్ ని సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. 

సుకుమార్ ఆ మాట చెప్పగానే యాంకర్ షాక్ అయ్యారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. 

యాంకర్ ఇంకా ప్రశ్నిస్తూ.. ఈ చిత్రానికి ఎన్టీఆర్ అయితే ఎలా ఉండేది అని ప్రశ్నించగా.. అలా కంపేర్ చేయడం తప్పు అని సుక్కు అన్నారు. కానీ ఎన్టీఆర్ అయితే ఈ కథకి అన్యాయం మాత్రం చేసి ఉండడు అని అన్నారు. రాంచరణ్ ఈ చిత్రంలో నటించిన తర్వాత ఇంకెవరూ నా మైండ్ లోకి రాలేదు అని తెలిపారు. 

click me!