సౌందర్య, ఆమనితో పాటు ఛాన్స్.. పొగరు చూపించిన ఇంద్రజ, డైరెక్టర్ ఏం చేశాడంటే.. దెబ్బకి ఏడుస్తూ..

First Published Apr 18, 2024, 2:47 PM IST

హీరోయిన్ ఇంద్రజ ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగింది. కృష్ణ, బాలకృష్ణ, జగపతి బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఇంద్రజ బుల్లితెరపై ఇంకా బాగా ఫేమస్ అయ్యారు.

హీరోయిన్ ఇంద్రజ ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగింది. కృష్ణ, బాలకృష్ణ, జగపతి బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఇంద్రజ బుల్లితెరపై ఇంకా బాగా ఫేమస్ అయ్యారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలతో ఇంద్రజ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే ప్రతి హీరోయిన్ కెరీర్ బిగినింగ్ లో ఏదో ఒక సంఘటన జరిగి ఉంటుంది. ఆ సంఘటనలు కెరీర్ లో మరపురాని అనుభూతులుగా మిగిలిపోతాయి. టాలీవుడ్ లో డైరెక్టర్ తేజ లాంటివారు హీరోయిన్లతో కఠినంగా వ్యవహరిస్తారు అనే టాక్ ఉంది. 90 దశకంలో డైరెక్టర్ సాగర్ కూడా అంతే నట. 

ఇంద్రజతో జరిగిన సంఘటనని సాగర్ స్వయంగా వివరించారు. ఇంద్రజ అప్పుడప్పుడే ఇండస్ట్రీ కి వచ్చింది మంచి నటి కదా అని సూపర్ స్టార్ కృష్ణ అమ్మ దొంగ మూవీ లో తీసుకున్నాం. ఆల్రెడీ హీరోయిన్లుగా సౌదర్య, ఆమని ఉన్నారు. ఇప్పుడు ఇంద్రజ కూడా ఎందుకు అన్నారు. కానీ నేనే నిర్మాతలని ఒప్పించి ఆ అమ్మాయిని తీసుకున్నాం. 

అమ్మ దొంగ చిత్రంలో ఇంద్రజని చాలా బాగా చూపించా. సినిమా కూడా హిట్. ఇంద్రజకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమెకి ఆఫర్స్ క్యూ కట్టాయి. మరోసారి కృష్ణ గారితో జగదేక వీరుడు సినిమా చేశాం. ఆ మూవీలో కూడా ఇంద్రజని తీసుకున్నాం. ఆ చిత్రంలో సీనియర్ నటి కెఆర్ విజయ గారుకూడా నటిస్తున్నారు. ఆమెకి ఫ్లైట్ బుక్ చేయమని మేనేజర్ కి చెప్పాం. 

దీనితో ఆమె నాకెందుకయ్యా ఫ్లైట్.. ట్రైన్ బుక్ చేయండి వచ్చేస్తాను అన్నారు. ఆమె మంచితనానికి ఆశ్చర్యపోయాం. ఆమెతో పాటు ఇంద్రజకి కూడానా ట్రైన్ బుక్ చేయమని చెప్పాం. కానీ ఆమె మేనేజర్ వద్ద పొగరు ప్రదర్శించిందట. ట్రైన్ లో వస్తే నాకు వాంతులు అవుతాయి. నేను రాను అని మొండికేసింది. దీనితో ఫ్లైట్ బుక్ చేయమని చెప్పా. 

Sagar

సెట్స్ లో అందరికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చా. ఇంద్రజ వస్తే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఏమన్నా ఉంటే డైరెక్టర్ తో మాట్లాడుకోండి అని చెప్పమని చెప్పా. మూడురోజులు ఎవరూ ఆమెతో మాట్లాడలేదు. మూడవరోజు ఏడుస్తూ నా దగ్గరకి వచ్చి సారీ చెప్పింది. నీకు ఇంత గుర్తింపు వచ్చిందే అమ్మదొంగ చిత్రం వల్ల. అది మరచిపోతే ఎలా అమ్మా.. నీ మీద ఉన్న మంచి అభిప్రాయం పోయింది నాకు అని మందలించినట్లు సాగర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

click me!