శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై నమోదైన బిట్ కాయిన్ పోంజి స్కామ్ కేసు దర్యాఫ్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈడీ అధికారులు అటాచ్ చేసిన ఆస్తుల్లో జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్ తోపాటు పూణెలో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న ఓ బంగ్లా, రాజ్ కుంద్రా పేరిట ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. ప్రివిన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) 2002 కింద అధికారులు ఈ అటాచ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.