కమెడియన్ కాళ్లు పట్టుకోబోయిన రామ్ చరణ్, షాక్ లో ఫ్యాన్స్, ఏం జరిగింది?

Published : Apr 10, 2025, 05:46 PM ISTUpdated : Apr 10, 2025, 05:54 PM IST

Ram Charan: రామ్ చరణ్ ఏంటి.. కమెడియన్ కాళ్లు పట్టుకోవడం ఏంటి? వినడానికి షాకింగ్ గా ఉంది కదా? అసలు రామ్ చరణ్ అలా ఎందుకు చేశారు ? ఆ కమెడియన్ రియాక్షన్ ఏంటి? అసలు ఇది ఏ సందర్భంలో జరిగింది? 

PREV
15
కమెడియన్ కాళ్లు పట్టుకోబోయిన రామ్ చరణ్, షాక్ లో ఫ్యాన్స్, ఏం జరిగింది?
peddi, ram charan

Ram Charan: మెగా పరవ్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈసినిమాలో రామ్ చరణ్ లుక్ చూసి మెస్మరైజ్ అవుతున్నారు ఫ్యాన్స్.  ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా కథను సుకుమార్ రాశారు. ఈసినిమాకు సబంధించిన పనులు ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. ఇప్పటికే పెద్ది టైటిల్ పోస్టర్ తో పాటు, ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు టీమ్. దాంతో పెద్ది సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. 

25

గేమ్ చేంజర్ ప్లాప్ అవ్వడంతో.. ఈసినిమాపై అన్ని ఆశలు పెట్టుకున్నారు చరణ్ ఫ్యాన్స్. పెద్ది గ్లింప్ లో  రామ్ చరణ్ ఊర మాస్ లుక్, స్వాగ్, డైలాగ్స్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ చరణ్  ఓ కమెడియన్ కాళ్లుపట్టుకోబోవడం వైరల్ అవుతోంది. 

35

రీసెంట్ గా యాంకర్ ప్రదీప్, కమెడియన్ సత్య రామ్ చరణ్ ను కలిశారు.  ప్రదీప్ మాచిరాజు  హీరోగా నటిస్తున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరు చరణ్ ను కలిసినట్లుగా తెలుస్తోంది. యాంకర్ ప్రదీప్, దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ కావడంతో, మూవీ పవన్ ఫ్యాన్స్ లో గట్టిగా ప్రమోట్ అవుతోంది. 

45

 కొన్ని రోజులుగా ఈ మూవీ టీమ్  ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈక్రమంలోనే  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ మూవీ టీమ్ రిలీజ్ చేసింది. రామ్ చరణ్ ను కలిసేందుకు వెళ్ళినప్పుడు కమెడియన్ సత్య అక్కడ ఓ చిన్న జోక్ పేల్చారు. సత్య మాట్లాడుతూ..  చరణ్ నాకు బాగా క్లోజ్ అని.. నేను ఎంత చెప్తే అంత అంటూ సత్య కాసేపు కామెడీ చేశారు. కానీ చరణ్ మాత్రం అసలు సత్య ఎవరో తనకు తెలియనట్టు.. పేరు కూడా గుర్తులేనట్టు ఆటపట్టించారు. నువ్వు కిషోర్ కదా..? నీ పేరు ఏంటీ అంటూ చరణ్ కూడా సత్యాను ఆటపట్టించారు. 
 

55

ఇక ఫస్ట్ మూవీ టికెట్ ను కొన్న రామ్ చరణ్ కాళ్లకు సత్య నమస్కారం పెట్టారు.  దీంతో చరణ్ సైతం కాళ్లు మొక్కెందుకు ప్రయత్నించగా.. సత్య వెంటనే పక్కకు జరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. చరణ్ మంచి మనసు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. గ్లోబల్ స్టార్ అయ్యుండి ఎంత సింపుల్ గా ఉంటున్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 

Read more Photos on
click me!

Recommended Stories