ఛావా రికార్డుల మోత, షారుఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చిన విక్కీ కౌశాల్

రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది ఛావా సినిమా. ఇండియాలో అత్యధిక వసూళ్ళు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. అంత కాదు షారుఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చింది ఛావా. అసలు సంగతేంటంటే? 

Vicky Kaushal Chhaava Box Office Success Story in telugu jms

విక్కీ కౌశల్, రష్మిక మందన్న  జంటగా  నటించిన తాజా చారిత్రక చిత్రం ఛావా, ఈసినిమా  షారుఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చింది. ఆయన  హిందీ ప్రేక్షకులతో పాటు, చావా తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 3 వారాల థియేటర్ రన్ లో  16 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం కల్కి 2898AD, జవాన్, RRR, KGF వంటి భారీ సినిమాలతో పాటు 600 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన ఏడవ భారతీయ చిత్రంగా నిలిచింది. 

Also Read: అల్లు అర్జున్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్, చివరకు మహేష్ బాబు కూడా హ్యాండిచ్చాడుగా?

Vicky Kaushal Chhaava Box Office Success Story in telugu jms
బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపింది!

ఛావా సినిమా  దేశ వ్యాప్తంగా 599.15 కోట్లు వసూలు చేసింది. అంతకు ముందు షారుఖ్ ఖాన్  జవాన్ 582.31 కోట్ల కలెక్షన్లు సాధించగా, ఆ రికార్డ్ ను దాటి, విమర్శకులు ప్రశంసలు కూడా పొందింది ఛావా మూవీ.


తెలుగు రాష్ట్రాల్లో కూడా ఛావా సినిమా 16 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే  600 కోట్ల కలెక్షన్ మార్క్ ను చేరింది.  

ఈ లోపు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర  చాలా సినిమాలు విడుదలైనా, ఛావా సినిమా మాత్రం తన జోరు తగ్గించకుండా కొనసాగిస్తోంది.  విజయవంతంగా నడుస్తోంది.

ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛావా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విక్కీ కౌశల్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇక రష్మికమందన్న పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Latest Videos

vuukle one pixel image
click me!