ఎరుపెక్కిన ఆకాశం లాగా మెస్మరైజ్ చేస్తున్న కృతి శెట్టి.. అమేజింగ్ పిక్స్ వైరల్

First Published | Dec 29, 2022, 9:58 PM IST

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.   


సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో కృతి శెట్టి ఉప్పెన తరహా విజయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. 

తాజాగా కృతి శెట్టి రెడ్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఎరుపెక్కిన ఆకాశం లాగా మైమరపిస్తున్న కృతి శెట్టి ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఉప్పెన పిల్ల పెదవుల అందం, నిలువెత్తు రూపంతో లాంగ్ డ్రెస్ లో మెరిసింది. 

2022కి ఇలా గుడ్ బై చెబుతున్నాను అని కామెంట్ పెట్టింది. కొత్త సంవత్సరం కోసం ఎదురుచూస్తున్నానని.. నూతన సంవత్సరం పాజిటివిటిని, సంతోషాన్ని తీసుకువస్తుందని కృతి శెట్టి పోస్ట్ చేసింది. 

ఈ ఏడాది కృతి శెట్టికి ఎక్కువగా పరాజయాలు ఎదురవుతున్నాయి. వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కృతి శెట్టి మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. 

Latest Videos

click me!