Divi
తెలుగు పిల్ల దివి ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చలిలో చెమటలు పట్టిస్తున్నాయి. ఆమె లేటెస్ట్ ఫొటోస్ కుర్రకారు నిదుర చెదిరేలా ఉన్నాయి. యదపై ఉన్న టాటూ హైలెట్ అవుతుండగా... నెటిజెన్స్ జూమ్ చేసి చేస్తున్నారు.
Divi
హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివి మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేశారు. తర్వాత మహర్షి మూవీలో స్టూడెంట్ గా కనిపించారు. ఆ మూవీలో దివికి మహేష్ తో కూడా రెండు మూడు డైలాగ్స్ ఉండడం విశేషం. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్ర కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.
Divi
దివి అనే ఓ హీరోయిన్ ఉందని బిగ్ బాస్ ద్వారానే తెలిసింది. సీజన్ 4 లో దివికి అవకాశం దక్కింది. దివి గ్లామర్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇతర లేడీ కంటెస్టెంట్స్ మాదిరి ఆమె అఫైర్స్, స్కిన్ షోకి దూరంగా ఉన్నారు. అలాగే గేమ్ అంత అగ్రెసివ్ గా ఉండేది కాదు.
Photo Credit-Divi Instagram
ఎక్కువగా అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేసింది. ఆ కారణంగా దివి కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేదు. షో మధ్యలోనే ఆమె ఆట ముగిసింది. ఆ సీజన్ లో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అఖిల్ రన్నర్ గా నిలిచారు. అరియానా, సోహైల్, అలేఖ్య ఫైనల్ కి చేరారు.
Bigg Boss Divi
ఫైనల్ కి చేరకున్నా దివికి మాత్రం ఫేమ్ దక్కింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు ఆఫర్స్ మొదలయ్యాయి. గతంతో పోల్చితే ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఏటీఎం టైటిల్ తో ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు.
ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే కెరీర్ ఊపందుకుంటుండగా స్టార్ కావాలనే ఆమె ఆశలు సజీవంగా ఉన్నాయి. దివి గ్లామర్ కి కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం కలదు.
ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్, జిన్నా చిత్రాల్లో దివి నటించారు. గాడ్ ఫాదర్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. జిన్నాను ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఆ మూవీలో మూగదైన హీరో ఫ్రెండ్ రోల్ చేశారు ఆమె.
ఒక ప్రక్కన అంది వచ్చిన అవకాశాలు కాదనకుండా చేస్తూనే సోషల్ మీడియా వేదికగా గ్లామర్ విందు చేస్తుంది. దర్శక నిర్మాతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. మరి చూడాలి దివి ఆశలు ఎంత మేరకు నెరవేరుతాయా..