మోహన్ లాల్ సినిమా కోసం కాలేజీకి హాలీడే.. కేరళాలో కాదు, ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన 'L2: ఎంపురాన్' సినిమా విడుదల సందర్భంగా ఓ కాలేజీకి సెలవు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన 'L2: ఎంపురాన్' సినిమా విడుదల సందర్భంగా ఓ కాలేజీకి సెలవు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.
College Leave For L2 Empuraan Movie Release : మలయాళ చిత్రాలకు కేరళలోనే కాదు, భారతదేశం అంతటా మంచి ఆదరణ లభిస్తోంది. దీనికి కారణం అక్కడ మంచి కథాంశంతో సినిమాలు రావడం. మలయాళంలో హిట్ అయితే ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మోహన్‌లాల్ నటించిన `ఎల్ 2ః ఎంపురన్` మూవీని డైరెక్ట్‌గా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 27న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
సాధారణంగా రజనీకాంత్ సినిమా విడుదలవుతుంటంటే సాఫ్ట్ వేర్ కంపెనీలు హాలీడే ప్రకటిస్తుంటాయి. బెంగుళూరులోని కొన్ని కంపెనీలు ఇలానే చేశాయి. కానీ ఇప్పుడు మోహన్‌లాల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ సారి సాఫ్ట్ వేర్ కంపెనీ కాదు, కాలేజీకి హాలీడే ప్రకటించడం విశేషం. బెంగళూరులోని గుడ్ షెపర్డ్ కాలేజ్, మోహన్‌లాల్ నటించిన 'ఎంపురాన్' సినిమా విడుదలయ్యే రోజు మార్చి 27న సెలవు దినంగా ప్రకటించింది.
ఆ కళాశాల ఛైర్మన్ మోహన్‌లాల్‌కు వీరాభిమాని అంట. దాని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇది విన జనాలు ఆశ్చర్యపోతున్నారు. స్టూడెంట్స్ అయితే ముక్కున వేలేసుకుంటున్నారు. మాక్కూడా అలాంటి చైర్మెన్ ఉంటే బాగుండు అనుకుంటున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మోహన్‌లాల్ ప్రతిభను, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వాన్ని గౌరవించే విధంగా 'ఎంపురాన్' సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. కొన్ని కంపెనీలు కూడా 'ఎంపురాన్' సినిమా విడుదల సందర్భంగా సెలవు ప్రకటించాయి. ఇది నిజంగా ఒక పండుగలా ఉంది.
ఈ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను రీచ్ అవుతుందా? అనేది చూడాలి. గతంలో వచ్చిన `లూసిఫర్` మూవీ పెద్ద విజయం సాధించింది. దీంతో ఈ మూవీపై అంచనాలున్నాయి. తెలుగులో కూడా మంచి బజ్ ఉంది. మరి ఆ అంచనాలను రీచ్ అవుతుందా? అనేది చూడాలి. ఇందులో భారీ కాస్టింగ్ ఉండబోతుందని, అదే సర్‌ప్రైజ్ అని తెలుస్తుంది.
also read: 3000 మంది హీరోయిన్లతో బెడ్ షేర్ చేసుకున్న హీరో.. దుబాయ్‌లో గ్రాండ్ పార్టీ ?