మెగా పవర్ స్టార్ రాంచరణ్ అమెరికాలో గేమ్ ఛేంజర్ గ్రాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళ్లారు. రాంచరణ్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం యుఎస్ వెళ్ళింది. అతిథులుగా సుకుమార్, బుచ్చిబాబు హాజరవుతున్నారు. దీనితో డల్లాస్ నగరం తెలుగు వారితో, మెగా అభిమానులతో సందడిగా మారింది.
మెగా అభిమానులు ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించబోతున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ సందర్భంగా అత్యంత భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో కెజిఎఫ్ స్టార్ యష్ కోసం అతడి ఫ్యాన్స్ అత్యంత ఎత్తైన కటౌట్ నిర్మించారు. కెజిఎఫ్ రిలీజ్ సందర్భంగా 217 అడుగుల కటౌట్ ని ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. అత్యంత ఎత్తైన కటౌట్ అనే రికార్డ్ యష్ పేరుపై ఉంది.
ఇప్పుడు ఆ రికార్డుని రాంచరణ్ అభిమానులు చెరిపివేస్తున్నారు. ఏకంగా 250 అడుగుల రాంచరణ్ కటౌట్ ని గేమ్ ఛేంజర్ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ రెడీ చేశారు. విజవాడలోని బృదావన్ కాలనీ, వజ్ర గ్రౌండ్స్ లో రాంచరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 29 సాయంత్రం 4 గంటలకి ఒక ఈవెంట్ లాగా ఈ కటౌట్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Ram charan RRR
గతంలో అత్యంత ఎత్తైన కటౌట్స్ రికార్డు యష్, ఆ తర్వాత సూర్య పేరుపై ఉంది. యష్ కటౌట్ 217 అడుగులు కాగా సూర్య ఎన్ జి కె చిత్రం కోసం ఆయన అభిమానులు 215 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ రికార్డులకు కళ్లెం వేస్తూ రాంచరణ్ కటౌట్ చరిత్ర సృష్టించబోతోంది.