మెగా షెడ్యూల్ కోసం శ్రీలంక ప్లైట్ ఎక్కాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. భార్య సీమంతం కోసం బ్రేక్ తీసుకున్న మెగా హీరో... లాంగ్ షెడ్యుల్ ను కంప్లీట్ చేసుకోబోతున్నాడు.
ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వరుసగా ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలతో డిజాస్టర్స్ ఫేస్ చేసిన రామ్ చరణ్.. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ నుంచి బయటపడాలని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అందుకే ఈ సారి పెద్దితో హిట్ కొట్టాలని చూస్తున్నాడు మెగా పవర్ స్టార్. ఈక్రమంలో పెద్ది సినిమా కోసం చాలా సిన్సియర్ గా కష్టపడుతున్నాడు చరణ్. సుకుమార్ కథ అందించిన ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడు.
24
శ్రీలంక బయలుదేరిన రామ్ చరణ్
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. ఈమూవీ తాజా షెడ్యూల్ ను శ్రీలంకలో ప్లాన్ చేశాడు దర్శకుడు. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే మూవీ టీమ్ శ్రీలంకలో లాండ్ అవ్వగా.. తాజాగా రామ్ చరణ్ కూడా శ్రీలంకకు బయలుదేరారు. రామ్ చరణ్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియయాలో వైరల్‌గా మారింది. ఈ షెడ్యూల్‌లో అక్కడ అందమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.
34
1000 మంది డ్యాన్సర్లతో
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్ డేట్స్ కు భారీగా రెస్పాన్స్ కూడా వస్తోంది. ఇక రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా మైసూరులో ఒక భారీ పాటను కూడా పెద్ది టీమ్ షూట్ చేశారు. ఈ సాంగ్ కోసం దాదాపు 1000 మందికి పైగా డ్యాన్సర్లతో రామ్ చరణ్‌పై ఆ సాంగ్ షూట్ జరిగింది. ఇక ఈ సాంగ్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రత్యకంగా రూపొందించినట్టు సమాచారం.
‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ తన పాత్ర కోసం పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకే సారి చేస్తున్నారు. ఇక ఈమూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా... సినిమాటోగ్రఫీని ఆర్ రత్నవేలు నిర్వహిస్తున్నారు, కాగా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. పాన్-ఇండియా స్థాయిలో.. గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.