రామ్‌ చరణ్‌ స్టేజ్‌పై ఫస్ట్ స్పీచ్‌, ఏం మాట్లాడాడో తెలుసా? కొడుకు మాటలకు చిరంజీవి ఎమోషనల్‌

First Published Oct 19, 2024, 11:47 AM IST

రామ్‌ చరణ్‌ ఫస్ట్ టైమ్‌ స్టేజ్‌పై ఎప్పుడు మాట్లాడాడో తెలుసా? ఆయన మాటల అరంగేట్రం చిరంజీవి ఎప్పుడు చేయించాడు? ఆ అరుదైన విషయం వైరల్‌ అవుతుంది. 
 

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. `ఆర్ఆర్‌ఆర్‌` సినిమా తర్వాత ఆయన రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా దాటి గ్లోబల్‌ వైడ్‌గా ఆయన పాపులర్‌ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే భారీ పాన్‌ ఇండియా సినిమాలతో రాబోతున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర, అరుదైన విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. రామ్‌ చరణ్‌ ఫస్ట్ టైమ్‌ స్టేజ్‌ మీద మాట్లాడిన వీడియో క్లిప్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

మరి రామ్‌ చరణ్‌ ఫస్ట్ స్టేజ్‌పై ఎప్పుడు మాట్లాడాడు? తన అభిమానులకు వారసుడిని చిరంజీవి ఎప్పుడు పరిచయం చేశారనేది చూస్తే.. చరణ్‌ స్టేజ్‌పై మెగా అభిమానులకు పరిచయమై ఏకంగా ఇరవై ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఆయన 2004లో మొదటి సారి స్టేజ్‌పై అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు.

అది కూడా తండ్రి, మెగాస్టార్‌ పుట్టిన రోజున కావడం విశేషం. 2004 ఆగస్ట్ 22న రామ్‌ చరణ్‌ ఫస్ట్ టైమ్‌ స్టేజ్‌ మీదకు వచ్చి చిరంజీవి ముందు అభిమానులతో మాట్లాడాడు. అయితే ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడతాడు అనేది అటు చిరంజీవికి, ఆ ఈవెంట్‌కి వచ్చిన సినిమా ప్రముఖులకు, అభిమానులకు ఓ ఎగ్జైటింగ్‌ విషయం. మరి ఇంతకి చరణ్‌ ఏం మాట్లాడాడనేది చూస్తే, 
 

Latest Videos


ప్రతి ఏడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఈవెంట్‌ని నిర్వహిస్తారు. ఇందులో మెగా హీరోలు, చిరంజీవితో పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్ట్ లు పాల్గొని మెగాస్టార్‌ గొప్పతనం గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెబుతుంటారు. అలానే 2004లో కూడా ఈవెంట్‌ నిర్వహించారు. శిల్పకళా వేదికలో ఈ వేడుక జరిగింది.

దీనికి చిరంజీవి కూడా వచ్చారు. అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే అదే ఈవెంట్‌కి తనయుడు చరణ్‌ని కూడా తీసుకొచ్చాడు. కారణం.. రామ్‌ చరణ్‌ని హీరోగా పరిచయం చేయాలనుకోవడం. అందులో భాగంగానే ముందుగానే అభిమానులకు పరిచయం చేశాడు చిరు. అభిమానులకు, జనాలకు ఆయన్ని అలవాటు చేసే ప్రయత్నం చేశారు. 
 

ఈ ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌ చేత మాట్లాడించారు చిరంజీవి. స్పీచ్‌ తెరంగేట్రం అంటూ మైక్‌ చరణ్‌కి ఇచ్చాడు. ఆయన మైక్‌ తీసుకోగానే అభిమానులు అరుపులతో హోరెత్తించారు. కాసేపు వరకు ఆయన్ని మాట్లాడనివ్వలేదు. దీంతో చిరంజీవి మైక్‌ తీసుకుని ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు, మీ అరుపులను నేను తట్టుకోగలను, కానీ వాడు పాపం పసివాడు, తట్టుకోలేడు. సహకరించాలని తెలిపారు. కాస్త వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. దీంతో చరణ్‌ స్పీచ్‌ స్టార్ట్ చేశాడు. ఏం మాట్లాడతాడనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.

చిరులో అది ఇంకాస్త ఎక్కువగా ఉంది. టెన్షన్‌గానూ ఉందట. మాట్లాడేంత పెద్దవాడు కాదు, కానీ ఏం మాట్లాడతాడో చూద్దాం, నాకూ టెన్షన్‌గానే ఉందన్నారు చిరంజీవి. మైక్‌ తీసుకున్న చరణ్‌, చిరుని పక్కనే ఉండాలని చెప్పడం విశేషం. చూశారా? నేను వెనకాల లేకపోతే భయపడుతున్నాడు? నేను వెనకాల ఉండాలి. వాడి వెనకాల మీరూ(ఫ్యాన్స్) కూడా ఉండాలన్నారు చిరంజీవి. 
 

ఇక ఎట్టకేలకు ఓపెన్‌ అయ్యాడు చరణ్‌. `ఈ సందర్భంగా ఏం మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి తరఫున, నా తరఫున, అభిమానులందరి తరఫున డాడీకి హ్యాపీ బర్త్ డే చెప్పుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా అంటూ స్టేజ్‌పైనే తండ్రి చిరంజీవికి కాళ్లకి దెండం పెట్టాడు చరణ్‌.

దీంతో కొడుకుని దగ్గరికి తీసుకుని హగ్‌ చేసుకున్నాడు చిరు. ఈ సంఘటన అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ క్షణంలో మెగాస్టార్‌ సైతం ఎమోషనల్‌గా కనిపించడం విశేషం. ఆ ఆనందంలో కొడుక్కి ముద్దు కూడా పెట్టాడు. అనంతరం మైక్‌ తీసుకుని చిరంజీవి మాట్లాడుతూ, నాకంటే వాడికి బాగా తెలుసు. ఎలా పడేయాలో మనుషుల్ని, నన్ను పడేశాడు` అంటూ చెప్పడం విశేషం. 
 

రామ్‌ చరణ్‌ `చిరుత` సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సంఘటన జరిగిన మూడేళ్లకి ఆయన హీరోగా అరంగేట్రం చేయడం విశేషం. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో `చిరుత` సినిమా రూపొందింది. ఇది మంచి విజయాన్ని సాధించింది. చరణ్‌కి గ్రాండ్‌ లాంచింగ్‌గా ఉపయోగపడింది. ఆ తర్వాత `మగధీర`తో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇది ఆయనకు కెరీర్‌ పరంగా తొలి బ్రేక్‌ అని చెప్పొచ్చు.

ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. `ఆరెంజ్‌`, `రచ్చ`, `నాయక్‌`, `జంజీర్‌`, `ఎవడు`, `గోవిందుడు అందరివాడేలే`, `బ్రూస్‌ లీ`, `ధృవ`, `రంగస్థలం`, `వినయ విధేయ రామ`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `ఆచార్య` సినిమాలు చేశాడు. ఇప్పుడు `గేమ్‌ ఛేంజర్‌` సినిమాలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది. 

ప్రేమ విషయం చెప్పనందుకు మంచు విష్ణుపైకి వెళ్లిన మోహన్‌బాబు.. సీన్‌లోకి స్టార్‌ డైరెక్టర్‌ భార్య, ఏంటి కథ?
 

click me!