రామ్ చరణ్ కి ఇష్టమైన ఫుడ్, వదలకుండా తినేస్తాడు, ఉపాసన చెప్పిన సీక్రెట్ రెసిపీ ఏంటీ?

Published : Aug 12, 2025, 10:06 AM IST

మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ కు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? డైట్ కూడా పక్కన పెట్టి తినేసే టేస్టీ ఫుడ్ ఐటమ్ ఏమై ఉంటుంది? మెగా కోడలు ఉపాసన చెప్పిన చరణ్ సీక్రేట్ ఫుడ్ రెసిపీ ఏంటో తెలుసా?

PREV
15

రామ్ చరణ్ ఫిట్ నెస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో ఒక్కో స్టెప్ ఎక్కుతూ వస్తున్నాడు. ఫిల్ నెస్ యాక్టింగ్, డాన్స్, యాక్షన్, డిఫరెంట్ లుక్స్ ఇలా చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా సినిమాకు కొత్తదనం చూపించుకుంటూ వస్తున్న మెగా హీరో, తన ఫ్యాన్స్ ను, ఆడియన్స్ ను అలరించడానికి ఎంతో కష్టపడుతున్నాడు. రంగస్థలం నుంచి రామ్ చరణ్ లో చాలా మార్పు కనిపిస్తుంది. ప్రతీ సినిమాను ఒక ఛాలెంజ్ లా తీసుకుని దూసుకుపోతున్నాడు స్టార్ హీరో. ఇక రామ్ చరణ్ ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ చూపిస్తారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్న చరణ్.. ఆ సినిమా కోసం రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో అలరించబోతున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఆయన కండలు తిరిగిన శరీరంతో జిమ్ లో వ్యాయామాలు చేస్తూ.. కఠినమైన డైట్ ఫాలో అవుతున్నాడు. చరణ్ జిమ్ లో ఎంత కష్టపడుతున్నాడో తాజాగా రిలీజ్ అయిన ఓ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

DID YOU KNOW ?
రామ్ చరణ్ ఇష్టంగా తినే ఫుడ్
రామ్ చరణ్ ఎంత డైట్ చేసినా ఆయన రసం అన్నం చాలా ఇష్టంగా తింటారు. రసంతో పాటు రామ్ చరణ్ కు నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
25

గ్లోబల్ స్టార్ కు ఇష్టమైన ఫుడ్

ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నరామ్ చరణ్ ఒక ఐటమ్ విషయంలో మాత్రం అస్సులు తినకుండా ఉండలేరట. ఈ ఆసక్తికర విషయాన్ని ఆయన భార్య ఉపాసన బయటపెట్టింది. ఉపాసన ఇటీవల ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఫేవరెట్ ఫుడ్ గురించి ప్రస్తావించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం — రసం రైస్ చరణ్‌కు ఎనలేని ఇష్టమట. అంతేకాదు, రసం రైస్‌తో పాటు ఆమ్లెట్ కలిపి తింటాడట రామ్ చరణ్. రసం అంటే ఎంత ఇష్టమంటే? ఒక్కోసారి రసం‌ను తాగడం కూడా ఆయనకు అలవాటు అని ఉపాసన వెల్లడించారు. డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే ముందు “రసం ఉందా?” అని అడుగుతాడట చరణ్.

35

ఉపాసన మాట్లాడుతూ

"ఆయనకు రసం అన్నం అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్లినా రసం ఉంటే చాలు తినేస్తాడు. అందుకే చరణ్ కు వీలుగా ఉండేందుకు మా అత్తమ్మ ప్రత్యేకంగా ఓ రెడీమేడ్ రసం పౌడర్ ను తయారు చేయించారు. ఆ ప్యాకెట్ వెంట తీసుకెళ్లి అక్కడే తయారుచేసుకొని తినిపిస్తాం. ఆయనకు అది కంఫర్ట్ ఫుడ్." అందుకే అది ఎప్పుడూ క్యారే చేస్తూ ఉంటారు. ఇంతటి డెడికేటెడ్ ఫిట్‌నెస్ ఫాలో అవుతూ కూడా రసం రైస్ పట్ల ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదని ఉపాసన తెలిపింది.అంతేకాదు, తనకైతే రాగి సంగటి, మటన్ పులుసు బాగా ఇష్టమని ఉపాసన పేర్కొన్నారు. తన కూతురికి కూడా ఆరోగ్యానికి మంచిదని ప్రతిరోజూ రాగి జావ తినిపిస్తానని చెప్పారు. మెగా ఫ్యామిలీ అంతా మంచి ఫుడీస్ అని , షూటింగ్స్ లేనప్పుడు రకరకాల వంటలు చేసి కుటుంబసభ్యులు అంతా కలిసి భోజనం చేస్తామని ఆమె చెప్పారు.

45

రామ్ చరణ్ సినిమాలు

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో తన పాత్రకు తగిన విధంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తూ కఠినమైన ఫిట్‌నెస్ ట్రైనింగ్ కొనసాగిస్తున్నాడు రాయ్ చరణ్. సుకుమార్ కథ అందించిన ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రూరల్ ఏరియాకు సబంధించిన స్పోర్డ్స్ డ్రామా కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ హీరోగా మారిన రామ్ చరణ్ వరుసగా రెండు ప్లాప్ లను చూశారు. ఆచార్య సినిమాతో పాటు గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ తో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు చరణ్. అందుకోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

55

పెద్ది సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని ప్లానింగ్ తో ఉన్న రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాను సుకుమార్ తో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి రిలీజ్ అయిన అప్ డేట్ వీడియో, పోస్టర్స్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. చరణ్ లుక్ కు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. మరి ఈసినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. పెద్ది సినిమాను నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories