రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఇంత వైల్డ్ గా మారారేంటి? డైరెక్టర్‌ని, నిర్మాతని పట్టుకుని బూతుల వర్షం

First Published | Sep 5, 2024, 8:50 PM IST

రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఉన్నట్టుండి వైల్డ్ గా మారిపోయాయి. బూతు పదాలు ఉపయోగిస్తూ దర్శకుడు, నిర్మాత, బ్యానర్‌పై ట్రోల్ చేస్తున్నారు. దారుణంగా ఆడుకుంటున్నారు. 
 

Ram Charan

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ని ఇప్పుడు ఫ్యాన్స్ ముద్దుగా గ్లోబల్‌ స్టార్‌ అని పిలుచుకుంటున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆయన రేంజ్‌ మారిపోయింది. ఆ తర్వాత ఆయన నటించిన `ఆచార్య` ఆడలేదు. ఇప్పుడు మరో పాన్‌ ఇండియా మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.

`గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. సుమారు 300కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. 
 

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు టైటిల్‌ గ్లింప్స్ వచ్చింది. ఆ తర్వాత `జరగండి జరగండి` పాట మాత్రమే విడుదలైంది. సినిమా ప్రారంభమై మూడేళ్లు అవుతున్నా, ఇప్పటి వరకు సినిమా నుంచి ఈ రెండే అప్‌డేట్లు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

అప్‌డేట్ల కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఆ మధ్య ప్రెస్‌ మీట్లలో సినిమా రిలీజ్‌ డేట్‌పై నిర్మాత దిల్‌ రాజు స్పందించారు. క్రిస్మస్‌ కి రాబోతున్నట్టు తెలిపారు. రెండు మూడు సార్లు అదే అప్‌డేట్లు ఇచ్చారు. అంతకు మించి ఈ మూవీ గురించి ఏం చెప్పడం లేదు. 
 


ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ సహనం కోల్పోయారు. అప్‌ డేట్‌ కోసం వాళ్లు నినాదాలు ప్రారంభించారు. మూకుమ్మడిగా సోషల్‌ మీడియా వేదికగా నిరసన తెలియజేస్తున్నారు. వేల మంది ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ట్విట్టర్‌లో ఏకంగా యాష్‌ ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తున్నారు.

బూతు యాష్‌ ట్యాగ్‌లను ఉపయోగిస్తూ ఆడుకుంటున్నారు. వాళ్ల పరువు తీస్తూ ట్రోల్‌ చేస్తుండటం గమనార్హం. అటు దర్శకుడు శంకర్‌ని, ఇటు నిర్మాత దిల్‌ రాజుని, బ్యానర్‌ ఎస్వీసీని ట్యాగ్‌ చేస్తూ బూతుల వర్షమే కురిపిస్తున్నారు. 

మరోవైపు మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ని కూడా వదలడం లేదు. ఈ సారి పాటలు అదిరిపోవాలని అంటున్నారు. డిజాప్పాయింట్‌ చేయకూడదని, ఆర్‌ఆర్‌ఆర్‌ పగిలిపోవాలంటున్నారు. కాపీ కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్‌ కూడా ఇస్తున్నారు. ప్రధానంగా రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` నుంచి టీజర్‌ని కోరుకుంటున్నారు.

గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ని విడుదల చేయాలని వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. రెండు రోజుల్లో(వినాయక చవితి)కి టీజర్‌ విడుదల చేస్తే ఓకే, లేదంటే మామూలుగా ఉండదని అటు దర్శకుడు శంకర్‌, ఇటు నిర్మాత దిల్‌ రాజుకి వార్నింగ్‌ ఇస్తుండటం గమనార్హం. దీంతో గత రెండు రోజులుగా గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌తోపాటు ఒక బూతు యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 
 

రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఇంత వైల్డ్ గా ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అప్‌ డేట్లు అడుగుతూ వచ్చారు, కానీ ఈ రేంజ్‌లో సహనం కోల్పోయి ప్రవర్తించింది తక్కువే. కానీ ఈ సారి వాళ్ల ఆవేశం కట్టలు తెంచుకున్నట్టు అనిపిస్తుంది. చెప్పలేని బూతు పదాలు వాడటమే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు.

ఇది నెట్టింట వైరల్‌గా మారింది. పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇంత జరిగినా నిర్మాత నుంచి గానీ, దర్శకుడి నుంచి గానీ రియాక్షన్‌ లేదు. మరి వినాయక చవితికైనా అప్‌ డేట్‌ ఇస్తారా? లేక డిజప్పాయింట్‌ చేస్తారా? అనేది చూడాలి. ఆ రోజు అప్‌ డేట్‌ రాకపోతే రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఇంకా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 
 

రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తుంది. శ్రీకాంత్‌, ఎస్‌ జే సూర్య, అంజలి, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శంకర్‌ ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల శంకర్‌ రూపొందించిన `భారతీయుడు 2` డిజాస్టర్‌ అయ్యింది.

ఈ నేపథ్యంలో `గేమ్‌ ఛేంజర్‌` విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కంటెంట్‌ పరంగా తేడా రాకుండా చూసుకుంటున్నట్టు, శంకర్‌ మరింత ఫోకస్డ్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన కంటెంట్‌ పోయిందని, పెన్‌ డ్రైవ్‌ మిస్సింగ్ అంటూ పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. తండ్రిగా రాజకీయ నాయకుడిగా, కొడుకు ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తారట. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. 
 

Latest Videos

click me!