రజనీకాంత్ కూలీ సినిమా కోసం నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్..? ఎంత వసూలు చేశాడంటే..?

First Published | Sep 5, 2024, 7:43 PM IST

కింగ్ నాగార్జున వరుస ప్లాప్ లు ఫేస్ చేస్తున్నాడు. బిగ్ బాస్ వల్ల కాస్త ఈ సీజన్ అంతా తెరపై సందడి చేయబోతున్నాడు నాగ్. అయితే ఆయన తాజా సినిమాకు షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటునట్టు తెలుస్తోంది. 

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జునకు చాలా కాలంగా హిట్ సినిమాలు లేవు. ఏ సినిమా చేసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఉపయోగం లేకుండా పోతోంది. బంగార్రాజు కాస్త పర్వాలేదు అనిపించింది కాని..హిట్ మాత్రం కాదు. ఆతరువాత నాగార్జున ఎంత ప్రయత్నం చేసినా.. హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. 

ఈక్రమంలో ఆయన సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటు నాగార్జున మాత్రమే కాదు.. అటు నాగచైతన్య, అఖిల్ పరిస్థితి కూడా అదే. అయితే ఎవరికీ సాలిడ్ హిట్స్ లేవు. ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అవ్వడంతో.. నాగార్జున్ బిజీ అయిపోయాడు. 

1000 రోజులు ఆడిన బాలయ్య ఏకైక సినిమా

ఈ మూడు నెలలు ఈ సీజన్ తో సందడి చేయబోతున్నాడు.హిట్లు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర నాగార్జున మార్కెట్ కూడా పడిపోయింది. ఈక్రమంలోనే ఆయన తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో కూలి సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. 

Latest Videos


Nagarjuna

అయితే ఈసినిమాలో డిఫరెంట్ పాత్రలో ఆయన కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా నాగార్జునకు చెందిర ఓపోస్టర్ ను కూడా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. అయితే నాగ్ పాత్ర ఇందులో ఎలా ఉండబోతోది అనేది ఉత్కంఠగా మారింది. తమిళంలో నాగార్జున చాలా కాలం తరువాత నటిస్తున్న సినిమా కావడంతో మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 

అయితే ఈసినిమా లో నాగార్జున గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కూలి సినిమా కోసం నాగార్జున తీసుకున్న రెమ్యునరేష్ నెట్టింటచర్చకు దారి తీసింది. ప్రస్తుతం హిట్ సినిమాలు లేకపోయినా..నాగార్జున సినిమా వస్తుంది అంటే ఎవరు పట్టించుకోని పరిస్థితి వచ్చినా.. ఆయనకు షాకింగ్ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. 

టాలీవుడ్ మన్మధుడు నాగార్జునకు కూలి సినిమా కోసం  ఏకంగా 24 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.  లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన‌ పాన్ ఇండియా సినిమా కూలీ. నాగార్జున ఈసినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ కూడా అయిపోయింది. సినిమా రిలీజ్ మాత్రమే మిగిలి ఉంది. 
 

Nagarjuna

ఇక ఈసినిమాలో నెగెటీవ్  షేడ్స్ ఉన్న డాన్ పాత్రలొ నాగార్జున కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ వచ్చిన వెంటనే  నాగార్జున కాస్త వెనక్కు తగ్గారట. వెంటనే ఆయనకు పాత్ర గురించి.. పాత్ర పవన్ గురించి వివరించి.. హై రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేశారట టీమ్. దాంతో నాగ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 

ఇప్పటివరకు నాగార్జున రెమ్యూనరేషన్ సోలో హీరోగా  నాగార్జున 10 కోట్ల లోపే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వరుస ఐదారు కోట్ల వరకు ఉంది. మధ్యలో ఒకటి, రెండు హిట్ సినిమాలు పడినప్పుడు మాత్రమే రు. 7 – 8 కోట్లు తీసుకున్నారు. నాగార్జునకు రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ అంటే చాలా చాలా ఎక్కువ. అలాంటిది ఏకంగా రూ.24 కోట్ల రెమ్యూనరేషన్‌తో కూలీ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఇండస్ట్రీ అంతా ఆశ్చర్య పోతుంది.

click me!