దిల్‌ రాజుని నిలబెట్టేందుకు రామ్‌ చరణ్‌ సంచలన నిర్ణయం, పారితోషికం కట్‌.. అభిమాని కోసం ఏం చేశాడో తెలుసా?

Published : Jan 18, 2025, 04:43 PM IST

`గేమ్‌ ఛేంజర్‌` వల్ల నిండా మునుగుతున్న నిర్మాత దిల్‌ రాజు కోసం రామ్‌ చరణ్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారట. అదే అభిమాని విసయంలోనూ తన గొప్ప మనసుని చాటుకున్నారు.   

PREV
16
దిల్‌ రాజుని నిలబెట్టేందుకు రామ్‌ చరణ్‌ సంచలన నిర్ణయం, పారితోషికం కట్‌.. అభిమాని కోసం ఏం చేశాడో తెలుసా?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఈ సంక్రాంతికి `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయింది. సోషల్‌ మీడియాలో దారుణమైన నెగటివిటీ సినిమాని దెబ్బ కొట్టింది. నిజానికి సినిమా యావరేజ్‌గా ఉంది. కానీ నెగటివ్‌ ప్రచారం మరింత చావు దెబ్బ కొట్టింది. పైరసీ, హెచ్‌డీ ప్రింట్‌ లీక్‌ కావడం వంటివి కూడా ఈ మూవీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 

26

సుమారు రూ. 450కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు దిల్‌ రాజు. ఇందులో థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.180కోట్లు అయ్యిందని సమాచారం. అలాగే ఓటీటీ రూపంలో మరో రూ.160కోట్ల వచ్చాయి. శాటిలైట్‌, ఆడియో రైట్స్ కలుపుకుని దాదాపు నాలుగు వందల కోట్లు వచ్చాయి.

అయినా నిర్మాతకు ఇంకా భారీ నష్టం వాటిళ్లబోతుంది. సినిమాని తీసుకున్న బయ్యర్లు కూడా బాగా నష్టపోవాల్సి వస్తుంది. వాళ్లకి కొంత అమౌంట్‌ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఈ లెక్కన నిర్మాత దిల్‌ రాజుకి ఇది భారీగా నష్టాలను తీసుకురాబోతుందని చెప్పొచ్చు. 

36

ఈ నేపథ్యంలో దిల్‌ రాజుని నిలబెట్టేందుకు రామ్‌ చరణ్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. నెక్ట్స్ మూవీ ఆయన బ్యానర్‌లోనే చేసేందుకు ఓకే చెప్పాడట. మరో సినిమా చేస్తాననే భరోసా ఇచ్చాడట. అయితే పారితోషికం తగ్గించుకుంటున్నట్టు తెలుస్తుంది. దిల్‌ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేయడంతోపాటు మినిమమ్‌ పారితోషికం తీసుకుంటానని మాట ఇచ్చినట్టు సమాచారం.

46

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నారు చరణ్‌. దీనికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా ఉంది. దీన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మరి దిల్‌ రాజు బ్యానర్‌లో దర్శకుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. 
 

56

ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ అభిమాని విషయంలో తన గొప్పమనసుని చాటుకున్నారు. అభిమాని కష్టాల్లో ఉంటే అన్నీ తానై వ్యవహరించారు. వైద్యానికి కావాల్సిన ఖర్చులన్నీ భరించారు. అభిమానికి అన్ని రకాలుగా అండగా నిలిచాడు. అభిమాని అభిమాని భార్య అనారోగ్యం నుంచి కోలుకుని మామూలు మనిషి అయ్యేందుకు తన వంతుగా సహాయం అందించారు.

తన బ్లడ్‌ బ్యాంక్‌లో క్రమం తప్పకుండా బ్లడ్‌ డొనేట్ చేస్తున్న అభిమాని మళ్లేశ్వర రావు భార్య అనారోగ్యానికి గురయ్యింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఆసుపత్రి బిల్లు విషయంలో ఆయన బాధపడుతున్నట్టు తెలుసుకున్నారు చరణ్‌. అంతే తన భార్య ఉపాసన సపోర్ట్ తో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య చికిత్స అందించే ఏర్పాటు చేశారు. 
 

66

దాదాపు 17 రోజులపాటు ఆమె ఐసీయూలో ఉన్నారు. ఆమె కోసం ఎప్పటికప్పుడు స్పెషల్‌ డాక్టర్లని కూడా ఏర్పాటు చేయించారు. ఆమె తిరిగి కోలుకునేంత వరకు ఉచితంగా వైద్యం అందించారు. తాజాగా ఆ అభిమాని అన్‌ స్టాపబుల్ షోలో తన అనుభవాలను పంచుకున్నారు.

రామ్‌ చరణ్‌ చేసిన సహాయం గురించి వెల్లడించారు. తనకు ఎంత అండగా నిలిచాడో వెల్లడించారు అభిమాని ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. అంతేకాదు ఇతర ఖర్చుల నిమిత్తం అన్‌ స్టాపబుల్, ఆహా నుంచి లక్ష రూపాయలు కూడా సహాయం అందించారు. ఈ విషయం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

read more; చిరంజీవి డాన్స్ చూసి బెదిరిపోయిన స్టార్‌ హీరో, శ్రీదేవితో ఆ పనిచేయించడానికి అభ్యంతరం!
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories