'గేమ్ ఛేంజర్' కథ శంకర్ గారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశారో తెలుసా.. రాంచరణ్ క్రేజీ కామెంట్స్

First Published | Jan 4, 2025, 9:41 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రిలో శనివారం రోజు గేమ్ ఛేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రిలో శనివారం రోజు గేమ్ ఛేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాంచరణ్ ఏం మాట్లాడతారో అని అంతా ఎదురుచూశారు. బాబాయ్, అబ్బాయ్ ని ఒకే వేదికపై చూడాలని ఫ్యాన్స్ అంతా ఎదురుచూశారు. ఆ క్షణం వచ్చేసింది. బాబాయ్ పక్కనే నిలబడి రాంచరణ్ ప్రసంగించారు. అయితే చరణ్ ఎక్కువసేపు మాట్లాడకుండా క్లుప్తంగా తాం ప్రసంగాన్ని ముగించారు. 


ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ రాంచరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హాజరైన అభిమానులని చూస్తుంటే నాకు సముద్రం చూస్తున్నట్లుగా ఉంది. మరో విషయం కూడా గుర్తుకు వస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో నిర్వహించిన తొలి ర్యాలీ గుర్తుకు వస్తోంది అని రాంచరణ్ తెలిపారు. 

అలాంటి పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడడం, ఆయనతో కుటుంబ సభ్యుడిగా ఉండడం తన అదృష్టం అని రాంచరణ్ పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ అంటే మీకు ఎవరు గుర్తుకు వస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ పాలిటిక్స్ లో అసలైన గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ గారు అని ప్రశంసలు కురిపించారు. 

Also Read : ముదిరిన రచ్చ, డాకు మహారాజ్ చిత్రాన్ని బాయ్ కాట్ చేస్తామంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..మధ్యలో నలిగిపోయేది వాళ్ళే

శంకర్ గారు గేమ్ ఛేంజర్ చిత్రంలో సన్నివేశాలని ఎవరిని ఉద్దేశించి రాశారో మీకు తెలుసు అంటూ రాంచరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవెంట్ లో ఎక్కువగా మాట్లాడలేకున్నాను.. మరో ఈవెంట్ లో అందరి గురించి మాట్లాడతాను అని రాంచరణ్ తన స్పీచ్ ముగించారు. 

Latest Videos

click me!