సినిమాని నాశనం చేసి నన్ను రోడ్డున పడేశాడు.. స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు, డైరెక్టర్ ఆవేదన

First Published | Jan 4, 2025, 8:03 PM IST

సినిమా డ్రాప్ అయిన కెట్టవన్ సినిమా దర్శకుడు జిటి నందు, శింబు వల్లే రోడ్డున పడ్డానని ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

శింబు అంటేనే సమస్య అనిపించేలా ఆయన చిక్కుకున్న వివాదాలు చాలానే ఉన్నాయి. సింబు నటించిన చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అలా ఆగిపోయిన సినిమాల్లో కెట్టవన్ ఒకటి. ఈ సినిమా కోసం సింబు పెంచుకున్న పొడవాటి జుట్టు, భిన్నమైన గెటప్‌తో ఉన్న పోస్టర్లు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. కానీ దర్శకుడితో విభేదాల వల్ల సినిమాను మధ్యలోనే ఆపేశారు శింబు.

కెట్టవన్ సినిమా దర్శకుడు జిటి నందు, శింబు వల్లే రోడ్డున పడ్డానని ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. “కెట్టవన్ ఆగిపోయాక సింబు నుంచి శుభవార్త వస్తుందని ఎదురు చూశా. సినిమా తీస్తున్నప్పుడు నాకు పెళ్లయి, పాప పుట్టింది. అప్పుడు సింబు 50 వేలు ఇచ్చాడు. అది ఆసుపత్రి ఖర్చులకు ఉపయోగపడింది. దాన్ని నేనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నా.


నటుడు శింబు

సింబు సాయం చేసిన వారం తర్వాత నాకు ఫోన్ చేశాడు. కెట్టవన్ క్లైమాక్స్ డైలాగ్ గురించి అడిగాడు. ఎందుకని అడిగా. ‘అంబానవం అడంగాదవన్ అసరాదవన్’ సినిమాకి ఆ డైలాగ్ కావాలి, బాగుంటుందనిపించింది అన్నాడు. సాయం చేశాడని ఆ డైలాగ్ చెప్పా.

కెట్టవన్ సినిమా

ఆ డైలాగ్ కెట్టవన్‌కే సరిపోతుంది. సినిమా సారాంశం అంతా ఆ డైలాగ్‌లోనే ఉంది అని సింబుకి చెప్పా. వినకుండా ‘అంబానవం అడంగాదవన్ అసరాదవన్’లో వాడుకుని నాశనం చేశాడు. కథ అంతా దొంగిలించి సినిమా తీసి ఉంటే సంతోషించేవాడిని. సాయం చేసినట్టు నటించి డైలాగ్ దొంగిలించడం బాధగా ఉంది. ఇప్పుడు నేను రోడ్డున పడ్డాను” అని జిటి నందు అన్నారు.

Latest Videos

click me!