Ram Charan: పంజాబ్ పోలీసులని తాకిన రాంచరణ్ క్రేజ్.. ఆ ఎఫెక్ట్ మాములుగా లేదుగా..

Published : Apr 16, 2022, 03:29 PM IST

రాంచరణ్ పాత్రలో శ్రీరాముడితో పోల్చుతూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టారు. రాంచరణ్ అల్లూరి పాత్ర నార్త్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది.

PREV
16
Ram Charan: పంజాబ్ పోలీసులని తాకిన రాంచరణ్ క్రేజ్.. ఆ ఎఫెక్ట్ మాములుగా లేదుగా..
Ram Charan

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయంగా నిలిచింది. రాంచరణ్ అల్లూరి సీతారారాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించిన ఈ మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ మరో 1000 కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

 

26
Ram Charan

దర్శక ధీరుడు రాజమౌళి ఎమోషన్స్ తో కట్టి పడేస్తూ.. విజువల్స్ తో అబ్బుర పరుస్తూ తాను మాస్టర్ స్టోరీ టెల్లర్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఇక ఈ చిత్రంలో రాంచరణ్ నటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. రంగస్థలం చిత్రంలో రాంచరణ్ ఎలాంటి నటన కనబరిచాడో అంతకు మించేలా ఈ చిత్రంలోప్ ప్రతి సీన్ లో అదరగొట్టాడు. 

 

36
Ram Charan

రాంచరణ్ తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. రాంచరణ్ ని చివర్లో అల్లూరి గెటప్ లో చూపించిన విధానం సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. కాషాయం వస్త్ర ధారణలో రాంచరణ్ అని శ్రీ రాముడిగా ప్రొజెట్ చేసిన విధానం నార్త్ ఆడియన్స్ లో బాగా క్లిక్ అయింది. 

 

46
Ram Charan

రాంచరణ్ పాత్రలో శ్రీరాముడితో పోల్చుతూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టారు. రాంచరణ్ అల్లూరి పాత్ర నార్త్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. రాంచరణ్ కి ఆర్ఆర్ఆర్ వల్ల నార్త్ లో క్రేజ్ కూడా పెరిగింది అని చెప్పొచ్చు. 

 

56
Ram Charan

ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. రాంచరణ్ తన తదుపరి చిత్రం కోసం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షెడ్యూల్ పంజాబ్ లో జరుగుతోంది. దీనితో షూటింగ్ లొకేషన్ లో పంజాబ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

66
Ram Charan

పంజాబ్ పోలీసులు రాంచరణ్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. లేడి పోలీసులు,  జంట్స్ అనే తేడా లేకుండా రాంచరణ్ తో సెల్ఫీలు తీసుకున్నారు. రాంచరణ్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. పంజాబ్ పోలీసులు అంతలా రాంచరణ్ అని అభిమానించడానికి కారణం ఆర్ఆర్ఆర్ చిత్రం అనే చెప్పొచ్చు. 

 

click me!

Recommended Stories