గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన తండ్రి చిరంజీవి అంటే ఎంత భయమో తెలుసా? ఆయనకు ఏదైనా చెప్పాలి అంటే చరణ్ ఏం చేసేవారో తెలుసా? డైరెక్ట్ గా మాట్లాడలేక లెటర్ రాసిన చెర్రీ.. మెగాస్టార్ ను ఏమని రిక్వెస్ట్ చేశారంటే..?
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్.. ఆతరువాత తన సొంత టాలెంట్ తో ఎదుగుతూ వచ్చాడు. తనకంటూ..ఓ ప్రత్యేకమైన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. చిరంజీవి ప్రభావం తనమీద లేకుండా.. సొంతంగా ఫ్యాన్ బేస్ ను కూడా సాధించాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు. హాలీవుడ్ రేంజ్ లో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్. ఒకప్పుడు చిరంజీవి వారసుడు రామ్ చరణ్.. అని ఇండస్ట్రీలో చెప్పుకునే స్థాయి నుంచి.. పాన్ ఇండియాలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కూడా హీరోనే అని చెప్పుకునేంతగా పేరు తెచ్చుకున్నాడు.
26
తండ్రి చాటు బిడ్డ
రామ్ చరణ్ ఎంత ఎదిగినా.. ఒదిగి ఉంటారు. పాన్ ఇండియా హీరో అయినా.. హాలీవుడ్ రేంజ్ లో ఇమేజ్ వచ్చినా సరే.. తన తండ్రి మాటమీదనే ఉంటాడు. మెగాస్టార్ గీసిన గీత దాటడు. రామ్ చరణ్ కెరీర్ ను చిరంజీవి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎక్కడా చరణ్ రాంగ్ స్టెప్ వేయకుండా.. జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. స్కూల్, కాలేజ్ డేస్ లో తండ్రి అంటే చరణ్ ఎంత భయంతో, గౌరవంతో ఉండేవారో.. స్టార్ అయిన తరువాత కూడా అదే గౌరవాన్ని చిరంజీవిపై చూపిస్తున్నారు. ఈక్రమంలో చిరంజీవి గురించి రామ్ చరణ్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
36
చిరంజీవి అంటే భయం..
స్టార్ హీరోల వారసులు చాలామంది ఇండస్ట్రీలో సెటిల్ అయిన తరువాత.. తల్లీ తండ్రుల నుంచి విడిపోయి, వేరు కాపురం పెడుతుంటారు. సెపరేట్ గా ఇల్లు కట్టుకుని తమ జీవితం తాము చూసుకుంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఇప్పటికీ తండ్రితో పాటే ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ గతంలో చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గోవిందుడు అందరివాడే సినిమా టైమ్ లో డైరెక్టర్ కృష్ణ వంశీతో పాటు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చరణ్. ఈక్రమంలో చిన్నప్పుడు తన తండ్రి చిరంజీవి అంటే ఎంత భయంతో ఉండేవారో వెల్లడించారు చరణ్.
ఒకసారి చిరంజీవి ఇంద్ర సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెల్లడానికి రెడీ అవుతున్నారు. అక్కడ దాయి దాయి దామా సాంగ్ షూట్ జరగబోతోంది. సరిగ్గా అదే టైమ్ లో రామ్ చరణ్ కు స్కూల్ హాలిడేస్ వచ్చాయి. దాంతో ఆయన తన తండ్రితో పాటు స్విస్ కు వెళ్లాలని అనుకున్నారు. కానీ చిరంజీవితో మాట్లాడటానికి చరణ్ భయపడేవారు. దాంతో ఎలాగైనా నాన్నతో స్విస్ కు వెళ్లాలని ఆయన కు ఓ లెటర్ రాశారు చరణ్. ''నాన్నా మీరు స్విట్జర్లాండ్ వెళ్తున్నారని తెలిసింది... నా స్కూల్ కు హాలీడేస్ ఇచ్చారు. నా ఫ్రెండ్స్ అంతా వాళ్లకు నచ్చిన ఊరు వెళ్లిపోయారు. నాకు మీతో పాటు స్విస్ రావాలని ఉంది. ప్లీస్ నాన్నా నన్ను కూడా తీసుకెళ్లండి.. మీ షూటింగ్ కు ఏమాత్రం ఇబ్బంది కలిగించను'' అని లెటర్ రాసి, మెగాస్టార్ టేబుల్ మీద పెట్టాడట రామ్ చరణ్.
56
మురిసిపోయిన మెగాస్టార్ చిరంజీవి.
రామ్ చరణ్ లెటర్ ను చూసిన చిరంజీవి.. ఎంతో మరిసిపోయారు. కోప్పడతాడు అనుకుంటే.. పగలబడి నవ్వేశారు. వెంటనే భార్య సురేఖను పిలిచి.. రేఖా చూశావా.. చెర్రి ఎలా లెటర్ రాసి పెట్టాడో అని నవ్వుకున్నారు. అంతే కాదు చరణ్ ఆశపడ్డట్టే తనతో పాటు స్విట్జర్లాండ్ తీసుకెళ్ళారు. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో ఎంతో సంతోషంగా వెల్లడించారు రామ్ చరణ్. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక చరణ్ గతంలో చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో.. మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
66
చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మన శంకరవరప్రసాదుగారు సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా బాబీ డైరెక్షన్ లో మరో సినిమా కమిట్ అయ్యారు చిరంజీవి. ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు డైరక్షన్ లో పెద్ది సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. రీసెంట్ గా ఈ సినిమా తాజా షేడ్యూల్ షూటింగ్ శ్రీలంకలో స్టార్ట్ అయ్యింది. ఈమూవీ తరువాత సుకుమార్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు మెగా పవర్ స్టార్.