రీతూ అన్ హెల్దీ రిలేషన్ పెట్టుకుంది, పవన్ ని పాడు చేస్తోంది.. వామ్మో మాధురి అరుపులతో దద్దరిల్లిన హౌస్

Published : Oct 27, 2025, 11:39 PM IST

బిగ్ బాస్ హౌస్ లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్న సభ్యులని నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియ ఊహించని విధంగా మాధురి, రీతూ మధ్య వివాదంగా మారింది. 

PREV
15
బిగ్ బాస్ హౌస్ లో 50వ రోజు 

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అక్టోబర్ 27న 50వ రోజు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈసారి నామినేషన్స్ ప్రక్రియని బిగ్ బాస్ విన్నూత్నంగా నిర్వహించారు. హౌస్ లో ఉన్న వారిని నామినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన సభ్యులకు ఇచ్చారు. దమ్ము శ్రీజ, ప్రియా, ఫ్లోరా షైనీ, మర్యాద మనీష్ లాంటి ఎలిమినేట్ అయిన సభ్యులు ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

25
సంజనని నామినేట్ చేసిన ప్రియా శెట్టి 

హౌస్ లో ఉండడానికి అర్హత లేదు అని ఎవరినైతే భావిస్తారో ఆ సభ్యులని నామినేట్ చేసి రీజన్ చెప్పాలి. హౌస్ లో ఉన్న మరొకరిని పిలిచి వాళ్లని ఇంకొకరిని నామినేట్ చేయమని చెప్పాలి. ముందుగా ప్రియా శెట్టి.. సంజనని నామినేట్ చేసింది. దివ్యని సంజన రోడ్డు రోలర్ అని అనడం తనకి నచ్చలేదని ప్రియా తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 9 బిగినింగ్ లో సంజన చాలా జెన్యూన్ గా ఉన్నారు అని.. ఇప్పుడు ఆ నిజాయతీ పోతోంది అని ప్రియా శెట్టి ఆరోపించింది. ఆ తర్వాత హౌస్ లోకి మర్యాద మనీష్ వచ్చారు. 

35
రీతూకి చుక్కలు చూపించిన ఫ్లోరా 

మనీష్.. కళ్యాణ్ ని నామినేట్ చేశారు. ఇమ్మాన్యుయేల్ ని కళ్యాణ్ వెన్నుపోటు పొడవడం తనకి నచ్చలేదు అని మనీష్ తెలిపారు. తనూజని నామినేట్ చేయమని ఇమ్మాన్యుయేల్ కళ్యాణ్ కి అవకాశం ఇచ్చారు. కానీ కళ్యాణ్ ఆమెని నామినేట్ చేయకపోవడం వెన్నుపోటు పొడవడమే అని మనీష్ అన్నారు. ఆ తర్వాత ఫ్లోరా షైనీ వచ్చారు. ఫ్లోరా షైనీ బలమైన పాయింట్స్ తో రీతూ చౌదరిని నామినేట్ చేసింది. రీతూ చౌదరి కేవలం ఫేక్ రిలేషన్ షిప్, లవ్ ట్రాక్ నడపడానికి మాత్రమే హౌస్ లోకి వచ్చింది. ముందుగా రీతూ కళ్యాణ్ వద్దకు వెళ్ళింది. అతడితో వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత పవన్ వద్దకు వెళ్ళింది. 

45
సుమన్ శెట్టి అసమర్థ కెప్టెన్ 

కానీ ఆమె పవన్ తో కూడా జెన్యూన్ గా లేదు. ఎవరికోసమో హెయిర్ కట్ చేసుకున్న రీతూ.. పవన్ కి డబ్బులు ఇవ్వడానికి మాత్రం చాలా ఆలోచించింది అని ఫ్లోరా షైనీ ఆరోపించింది. ఫ్లోరా షైనీ మరో కంటెస్టెంట్ ని నామినేట్ చేసే అవకాశం సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ శెట్టి సంజనని నామినేట్ చేశారు. చెత్త విషయంలో సంజన బిహేవియర్ నచ్చలేదని, ఆమె కెప్టెన్ ని గౌరవించే వ్యక్తి కాదని సుమన్ శెట్టి అన్నారు. సంజన సుమన్ శెట్టిపై ఒకరేంజ్ లో ఫైర్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోనే వరస్ట్ కెప్టెన్, అసమర్థ కెప్టెన్ సుమన్ శెట్టి అని కౌంటర్ ఇచ్చింది. 

55
మాధురి అరుపులతో దద్దరిల్లిన హౌస్ 

ఆ తర్వాత దమ్ము శ్రీజ వచ్చి కళ్యాణ్ ని నామినేట్ చేసింది. కళ్యాణ్ ని అమ్మాయిల పిచ్చోడు అన్నారు.అతడి క్యారెక్టర్ పై మచ్చ వేశాడు. అయినా కూడా కళ్యాణ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ కాకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది అని శ్రీజ తెలిపింది. ఆ తర్వాత శ్రీజ రీతూ, మాధురి మధ్య గొడవ పెట్టేసింది. మరో కంటెస్టెంట్ ని నామినేట్ చేసే అవకాశం శ్రీజ మాధురికి ఇచ్చింది. దీనితో మాధురి.. రీతూని నామినేట్ చేసింది. పవన్ విషయంలో మాధురి రీతూపై సంచలన ఆరోపణలు చేసింది. నువ్వు పవన్ ని సపోర్ట్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడడానికి వచ్చావా అని మాధురి ప్రశ్నించింది. దీనితో రీతూ కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. మీకు లేవా హౌస్ లో రిలేషన్స్ అని ప్రశ్నించింది.  నీది అన్ హెల్దీ బాడింగ్, మాది హెల్దీ బాండింగ్. మీ ఇద్దరి వల్ల హౌస్ లో అందరికీ టార్చర్ గా ఉంటోంది అంటూ మాధురి బిగ్గరగా అరుస్తూ రీతూపైకి దూకింది. పవన్ చాలా మంచి అబ్బాయి. కానీ అతడిని పాడు చేస్తోంది రీతూనే. నీ వాళ్ళ పవన్ స్పాయిల్ అవుతున్నాడు అంటూ మాధురి రచ్చ రచ్చ చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories