40 ప్లస్ లో స్టన్నింగ్ లుక్, సిల్వర్ కలర్ డ్రెస్ లో శ్రీయ శరన్ మెరుపులు చూశారా

Published : Oct 27, 2025, 10:06 PM IST

రీసెంట్ గా మిరాయ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీయ శరన్ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేసింది. నాలుగు పదుల వయసులో కూడా శ్రీయ గ్లామర్ జోరు తగ్గడం లేదు. 

PREV
18
రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ లో శ్రీయ శరన్

శ్రీయ శరన్ రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ లో నటిగా రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా టాప్ స్టార్స్ అందరితో శ్రీయ నటించారు. 

28
నాగార్జున మూవీతో గుర్తింపు

2001లో వచ్చిన "ఇష్టం" చిత్రంతో శ్రీయా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత నాగార్జున "సంతోషం" సినిమాలో నాగార్జున సరసన నటించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ సినిమా ఆమెకు కెరీర్‌లో పెద్ద బ్రేక్‌గా మారింది.

38
శ్రీయ నటించిన చిత్రాలు

శ్రీయ తన కెరీర్ లో నువ్వే నువ్వే, ఠాగూర్, ఛత్రపతి, అర్జున్, బాలు, సంతోషం, చెన్నకేశవరెడ్డి లాంటి చిత్రాల్లో నటించారు. రజనీకాంత్‌తో నటించిన "శివాజీ – ది బాస్" (2007) చిత్రం ఆమెకు పాన్‌-ఇండియా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత ఆమె తమిళ, హిందీ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ తన ప్రతిభ చూపించింది.

48
రాజమౌళి దర్శకత్వంలో రెండు సార్లు

శ్రీయా శరణ్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన "RRR" చిత్రంలో రామచరణ్‌ తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఛత్రపతి, ఆర్ఆర్ఆర్ ఇలా రెండు సార్లు రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఘనత అందుకుంది.

58
మిరాయ్ మూవీలో శ్రీయ

రీసెంట్ గా శ్రీయ శరన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయ్ చిత్రంలో ఆమె హీరో కి తల్లి పాత్రలో నటించింది.

68
తేజ సజ్జాకి తల్లిగా నటించిన శ్రీయ

దాదాపు 20 ఏళ్ళ క్రితం శ్రీయ నటించిన ఠాగూర్, బాలు లాంటి చిత్రాల్లో తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇప్పుడు మిరాయ్ చిత్రంలో అతడు హీరో. అతడికి శ్రీయ తల్లిగా నటించడం విశేషం. 

78
వయసుకి తగ్గ పాత్రలు

శ్రీయ శరన్ 40 ప్లస్ ఏజ్ లో కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది. ఆమె వయసుకు తగ్గ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ గ్లామర్ విషయంలో శ్రీయ ఏమాత్రం తగ్గడం లేదు.

88
గ్లామర్ జోరు తగ్గడం లేదు

సోషల్ మీడియాలో శ్రీయ నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ యువతని ఆకర్షిస్తోంది. తాజాగా శ్రీయ సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తూ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories