చికిరి సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్, కానీ ట్రోలింగ్ తో ఇలా చేశారేంటి.. మరో ట్విస్ట్ ఉంటుందా ?

Published : Nov 08, 2025, 08:49 AM IST

రాంచరణ్ పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సాంగ్ పై కొంత నెగిటివిటీ కూడా ఉంది. అయితే రెహమాన్ నుంచి మరో ట్విస్ట్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

PREV
15
పెద్ది మూవీ చికిరి సాంగ్ 

మెగా పవర్ స్టార్ రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ భారీ సిక్సర్ లాగా ఫ్యాన్స్ ని అలరిస్తోంది. టీజర్ ఎలా వైరల్ అయిందో చూశాం. ఇప్పుడు చికిరి సాంగ్ వంతు వచ్చింది. శుక్రవారం రోజు చికిరి సాంగ్ ని రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గట్లుగా పాట అదిరిపోయింది. రెహమాన్ మ్యూజిక్, రాంచరణ్ డ్యాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్, బుచ్చిబాబు విజువల్స్ ఇలా ప్రతి అంశంలో ప్రేక్షకులని ఈ సాంగ్ థ్రిల్ చేస్తోంది. 

25
మిలియన్ల వ్యూస్ తో రికార్డులు 

ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి దాదాపు 40 మిలియన్ల వ్యూస్ తో చికిరి పాట దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత రాంచరణ్ సోలోగా డ్యాన్స్ లో తన గ్రేస్ చూపిస్తున్నారు. చిరుత, రచ్చ, మగధీర, నాయక్ లాంటి సినిమాల్లో రాంచరణ్ తన డ్యాన్స్ తో ఎలాంటి గ్రేస్ ప్రదర్శించారో ఇప్పుడు చికిరి సాంగ్ లో ఆ వైబ్ ఉందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై రీల్స్ కూడా మొదలయ్యాయి. 

35
సాంగ్ పై ట్రోలింగ్ కూడా.. 

ఇంతలా చికిరి పాట దూసుకుపోతున్నప్పటికీ కొంత నెగిటివిటీ కూడా ఉంది. కొందరు నెటిజన్లు రెహమాన్ సంగీతంలో మునుపటిలా కొత్తదనం లేదని కామెంట్స్ చేస్తున్నారు. రాంచరణ్ డ్యాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్ వల్ల సాంగ్ అప్పీలింగ్ గా ఉంది కానీ.. మ్యూజిక్ పరంగా అంత గొప్పగా లేదని పెదవి విరుస్తున్నారు. 

45
తమిళ వెర్షన్ ఎందుకు రిలీజ్ చేయలేదు ?

ఓ వైపు ట్రోలింగ్ ఉన్నప్పటికీ వ్యూస్ పరంగా చికిరి సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే మరో విషయంలో చిత్ర యూనిట్ అనుమానాలు పెంచుతోంది. చికిరి సాంగ్ తెలుగు తో పాటు హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలైంది. తమిళ వెర్షన్ ని మాత్రం రిలీజ్ చేయలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అని చర్చించుకుంటున్నారు. చిత్ర యూనిట్ మాత్రం తమిళ వర్షన్ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. 

55
రెహమాన్ నుంచి సర్ప్రైజ్ ఉంటుందా ?

తెలుగు, హిందీలో మోహిత్ చౌహాన్.. కన్నడలో సంజిత్ హెగ్డే.. మలయాళంలో బెన్నీ దయాల్ ఈ పాటని పాడారు. తమిళ వెర్షన్ ని మాత్రం ఏఆర్ రెహమాన్ స్వయంగా పాడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళ ఆడియన్స్ కోసం రెహమాన్ లైవ్ కన్సర్ట్ లో ఈ పాటని పాడి వినిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే తమిళ వెర్షన్ రిలీజ్ చేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో చిత్ర యూనిట్ స్పందించాలి. 

Read more Photos on
click me!

Recommended Stories