కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోకు బిగ్ షాక్- కొత్త సీఈఓగా దీప?- దీప చావు ఖాయమన్న పారు

Published : Nov 08, 2025, 07:44 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 8వ తేదీ)లో కొత్త సీఈఓ కార్తీక్ సారే కదా అంటారు బోర్డు మెంబర్స్. బావకు ఆ అర్హత లేదంటుంది జ్యో. అగ్రిమెంటుకు కట్టుబడి ఉన్నా అంటాడు కార్తీక్. కొత్త సీఈఓ అనగానే ఎంట్రీ ఇస్తుంది దీప. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. 

PREV
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో ఇది వంటగదిలో ఏం చేస్తోంది అని తొంగి చూసుకుంటూ వెళ్తుంది పారిజాతం. దీప సడెన్ గా ఎదురుగా వస్తుంది. ఉలిక్కిపడి.. ఇంత దగ్గరగా వచ్చావేంటే అంటుంది పారు. మీరు నాకోసమే కదా చూస్తున్నారు అంటుంది దీప. కొత్త సీఈఓ మీ బావేనట కదా.. బయట టాక్ నడుస్తోంది అంటుంది పారు. ఏమో నాకు తెలీదు అంటుంది దీప.

అయినా కార్తీక్ ఎలా సీఈఓ అవుతాడు? జ్యోత్స్న నీకు ఏదో ఆఫర్ కూడా ఇచ్చిందట కదా.. నువ్వు మీ బావతో మాట్లాడలేదా? అంటుంది పారు. జ్యోత్స్నకు మీరే కదా చెప్పి పంపించింది అంటుంది దీప. నేనే ఎందుకు చెప్తానే.. అదే వచ్చి నాకు చెప్పింది అంటుంది పారు. సరే వంట ఏం చేస్తున్నావు అని అడుగుతుంది పారు. సాంబార్ చేస్తున్నాను అంటుంది దీప. సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం అందులో గుమ్మడికాయ వేయ్ అంటుంది పారు. కాయ వేస్తే బాగుండదు అంటుంది దీప. కార్తీక్ గాడు పోయాడు. నువ్వు తగులుకున్నావా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది పారు.

26
కొత్త సీఈఓ బావే..

మరోపక్క మీటింగ్ రూమ్ లోకి వస్తాడు కార్తీక్.. కూర్చో కార్తీక్ అంటాడు శివన్నారాయణ. పర్లేదు అంటాడు కార్తీక్. నీకు ఇక్కడ కూర్చునే అర్హత ఉంది కూర్చోమంటాడు శివన్నారాయణ. కొత్త సీఈఓ బావే. దీన్ని ఎలాగైనా ఆపాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. మేము అనుకున్న వ్యక్తినే మీరు కూడా సీఈఓగా అనుకుంటున్నారు. ఇక ఆలస్యమెందుకు పేరు ప్రకటించండి అంటాడు బోర్డ్ మెంబర్ భరణి. 

ఆగండి అంకుల్ అంత తొందరెందుకు అంటుంది జ్యోత్స్న. మా బావకు సీఈఓ అయ్యే అర్హత లేదు అంటుంది. కార్తీక్ అర్హత గురించి నువ్వు మాట్లాడుతున్నావా అంటాడు దశరథ. బావ అగ్రిమెంటు మీద సంతకం చేశాడు. నా పర్మిషన్ లేకుండా తను ఏ పని చేయడానికి లేదు అంటుంది జ్యోత్స్న. కార్తీక్ కూడా అగ్రిమెంటుకు నేను కట్టుబడి ఉన్నాను. నన్ను క్షమించండి అంటాడు. 

ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. కానీ ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడానికి నేను కూడా సైలెంట్ గా ఉన్నాను అంటాడు శివన్నారాయణ. సీఈఓగా నేను వేరే వ్యక్తిని అనుకుంటున్నాను అని చెప్తాడు శివన్నారాయణ. .కార్తీక్ మనం అనుకున్నది ఏమైంది అని అడుగుతాడు. ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అంటాడు కార్తీక్. 

36
కొత్త సీఈఓగా దీప?

కొత్త సీఈఓ ఎవరు అని అంటుండగా దీప ఎంట్రీ ఇస్తుంది. జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ అవుతుంది. దీప కొత్త సీఈఓ నా? బావ ప్లాన్ ఇదా? నీ ప్లాన్ వర్కౌట్ కాకుండా నేను ఏదో ఒకటి చేస్తాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. లంచ్ తర్వాత సీఈఓ పేరు ప్రకటిస్తాను అంటాడు శివన్నారాయణ. బోర్డ్ మెంబర్ ఏదో చెప్పబోతుండగా.. లంచ్ అందరికి వచ్చింది. భోజనం చేశాక మాట్లాడుకుందాం పదండి అంటూ అందరిని తీసుకెళ్తాడు శివన్నారాయణ.

46
షాక్ అయిన పారు

పారిజాతానికి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. హలో గ్రానీ అనగానే.. నీ ఫోన్ కోసమే చూస్తున్నా. అక్కడ ఏం జరుగుతోంది? మనం అనుకున్నదే జరుగుతోందా? మీ తాత కార్తీక్ ని కొత్త సీఈఓ చేశాడా? అంటుంది పారు. కొత్త సీఈఓ బావ కాదు గ్రానీ దీప అంటుంది జ్యోత్స్న. షాక్ అవుతుంది పారు. దీప సీఈఓ అయితే నేను ఊరుకుంటానా? నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు నిన్ను కాపాడగలిగేది మీ అమ్మ ఒక్కతే. నేను సుమిత్రను తీసుకొని ఆఫీసుకి వస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది పారు.

56
నువ్వు తల్లివేనా?

సుమిత్రను పిలిచి.. జ్యోత్స్నను ఏ ఇంటికి అయినా పనిమనిషిగా పంపించండి అంటుంది పారు. ఏమైంది అత్తయ్య.. ఎందుకలా మాట్లాడుతున్నారు అంటుంది సుమిత్ర. ఈ ఇంటి పనిమనిషికి ఉన్న విలువ వారసురాలికి లేదు. దీపేనట కొత్త సీఈఓ అంటుంది పారు. మీరు పొరపాటు పడుతున్నారు దీప లంచ్ బాక్స్ తీసుకెళ్లింది అంతే. తనేలా సీఈఓ అవుతుంది అంటుంది సుమిత్ర. 

అక్కడ అదే జరుగుతోంది. నువ్వు త్వరగా రా సుమిత్ర. మనం దీన్ని ఆపాలి అంటుంది పారు. మామయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను, నా భర్త కట్టుబడి ఉంటాము అంటుంది సుమిత్ర. అసలు నువ్వు తల్లివేనా? నీ కూతురు ఓటమిని అస్సలు ఒప్పుకోదు. ఏమైనా చేసుకుంటే ఏం చేస్తావు? జ్యోత్స్న బాగుండాలంటే మనం దీన్ని ఆపి తీరాలి అంటుంది పారు. సరే వెళ్దాం. నేను చీర మార్చుకొని వస్తాను అంటుంది సుమిత్ర.

66
దీపను చంపేస్తాను

శివన్నారాయణ.. నేను నా మనుమరాలు సంతోషంగా ఉండటం కోసం ఏదైనా చేస్తాను. నువ్వు నా మనుమరాలిని కాదని దీపను సీఈఓ చేస్తే.. ఊరుకుంటాను అనుకుంటున్నావా? దీపను నేనే చంపేస్తాను అని కత్తి చేతిలోకి తీసుకుంటుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories