చికిరి వెనుక కష్టానికి చిరుత కనెక్షన్.. 45 నిమిషాలు కొండల్లో రాంచరణ్ ని నడిపించిన బుచ్చిబాబు

Published : Nov 28, 2025, 07:13 AM IST

రాంచరణ్ పెద్ది చిత్రంలోని చికిరి సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ సంచలనాలు సృష్టించడం వెనుక పెద్ది చిత్ర యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. చరణ్ ఈ సాంగ్ కోసం కష్టాలు పడుతూ 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేశారు. 

PREV
15
రాంచరణ్ చికిరి సాంగ్ 

రాంచరణ్ పెద్ది సినిమాపై చికిరి సాంగ్ తో అమాంతం బజ్ పెరిగింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన చికిరి సాంగ్ ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఈ సాంగ్ లో రెహమాన్ బీట్, రాంచరణ్ మాస్ డ్యాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్ హైలైట్ గా నిలిచాయి. 

25
45 నిమిషాలు ట్రెక్కింగ్ 

అయితే ఈ సాంగ్ చిత్రీకరించడం కోసం పెద్ది యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. చికిరి సాంగ్ లో రాంచరణ్ ఎంతో అందమైన లొకేషన్స్ లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ లొకేషన్స్ కి చేరుకోవడానికి చిత్ర యూనిట్ కొండల్లో కోనల్లో 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది. చికిరి సాంగ్ వెనుక ఉన్న కష్టాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ వీడియో రిలీజ్ చేశారు. 

35
అలసిపోయిన చరణ్ 

ఈ వీడియోలో రాంచరణ్, బుచ్చిబాబు, జాన్వీ కపూర్ ఇతర చిత్ర యూనిట్ ట్రెక్కింగ్ చేస్తూ కనిపించారు. రోప్ సహాయంతో కొండని ఎక్కారు. హిల్ స్టేషన్ కి చేరుకోవడానికి 45 నిమిషాలు పట్టింది అని తెలియాజేశారు. ఒకదశలో రాంచరణ్ అలసిపోయారు. బుచ్చిబాబు జాగ్రత్త అంటూ హెచ్చరించడం ఆకట్టుకుంటోంది. 

45
చికిరి సాంగ్ కి చిరుత కనెక్షన్ 

షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కెమెరాలు, మేకప్ కిట్ కావలసిన వస్తువులు మొత్తం మోసుకెళ్లారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు రాంచరణ్ తో కొండ ఎక్కుతూనే ఒక విషయాన్ని పంచుకున్నారు. చిరుత సినిమాతో మీ ఎంట్రీ కోసం ఎంతో ఎదురుచూశాం. ఫస్ట్ డే మూవీ చూశాక థియేటర్ లో మరోసారి ఒక్కో పాట రెండుసార్లు వేయించుకుని ఎంజాయ్ చేశాం. అలాంటిది ఇప్పుడు మీతో సాంగ్ షూట్ చేస్తున్నాను సార్ అంటూ బుచ్చిబాబు తన సంతోషాన్ని తెలియజేశారు. 

55
రాంచరణ్ స్టెప్పులు

చివరికి చిత్ర యూనిట్ కొండపైకి చేరుకోవడం.. రాంచరణ్ ఎంతో గ్రేస్ తో అక్కడ డ్యాన్స్ చేయడం ఈ విజువల్స్ లో చూపించారు. చరణ్ డ్యాన్స్ పూర్తి చేయగానే లొకేషన్ లో చిత్ర యూనిట్ మొత్తం చప్పట్లు కొట్టి అభినందించారు.

Read more Photos on
click me!

Recommended Stories