రాసిపెట్టుకోండి రంగస్థలం, RRR ని మించేలా 'పెద్ది' .. గేమ్ ఛేంజర్ వివాదం నేపథ్యంలో రామ్ చరణ్ కామెంట్స్ వైరల్

Published : Jul 02, 2025, 08:37 PM IST

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం విడుదలై 6 నెలలు గడిచినప్పటికీ ఆ మూవీ ఇంకా వివాదాల్లో నలుగుతూనే ఉంది. ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
15

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం విడుదలై 6 నెలలు గడిచినప్పటికీ ఆ మూవీ ఇంకా వివాదాల్లో నలుగుతూనే ఉంది. గేమ్ ఛేంజర్ వల్ల చాలా నష్టపోయామని, ఆ మూవీలో చేసిన తప్పులు ఇక రిపీట్ చేయకూడదు అని అనుకుంటున్నట్లు దిల్ రాజు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. తాజాగా దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఈ మంటల్ని మరింత పెంచుతూ కామెంట్స్ చేసి ట్రోలింగ్ కి గురయ్యారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ చేయడంతో చివరికి క్షమాపణ చెప్పారు. 

25

గేమ్ ఛేంజర్ చిత్రం తమకి తీరని నష్టాలు మిగిల్చిందని.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ లేకుంటే మా పని అవుట్ అని శిరీష్ రెడ్డి కామెంట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ ఫ్లాప్ అయ్యాక శంకర్ కానీ, రామ్ చరణ్ కానీ కనీసం కర్టెసీకి కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడగలేదని శిరీష్ రెడ్డి వ్యాఖ్యానించడం పెద్ద వివాదం అయింది. దీనితో రామ్ చరణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి డైరెక్ట్ గా దిల్ రాజుకి వార్నింగ్ ఇచ్చారు. డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి శిరీష్ క్షమాపణలు చెబుతూ లెటర్, వీడియో బైట్ రిలీజ్ చేశారు. 

35

ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్ కొత్త చిత్రం పెద్ది బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కొన్ని వారాల క్రితం రామ్ చరణ్ లండన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. తన వ్యాక్స్ స్టాట్యూ లాంచ్ కోసం చరణ్ ఫ్యామిలీతో లండన్ వెళ్లారు. అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన మీటింగ్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ పెద్ది మూవీపై అంచనాలు పెంచేశారు. 

45

“పెద్ది గ్లింప్స్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. ఇది నా కెరీర్‌లో చేసిన అత్యంత ఆసక్తికరమైన స్క్రిప్ట్‌లలో ఒకటి. ఇది రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్ కంటే కూడా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రతీ సినిమాకు ఇలా అనను. మీరు రాసిపెట్టుకోండి,” అని రామ్ చరణ్ మే నెలలో లండన్‌లో జరిగిన ఓ అభిమానుల సమావేశంలో అన్నారు.ఈ ఫ్యాన్ మీట్, రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన వ్యాక్స్ స్టాచ్యూ ఆవిష్కరణ సందర్భంగా జరిగినది. 

55

ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో పెద్ది షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఓ భారీ రైలు సీక్వెన్స్ కోసం ప్రత్యేకమైన సెటప్‌ను నిర్మించారు. రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏ ఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జన్వీ కపూర్ నటిస్తున్నారు. అలాగే శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు లాంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2026 మార్చి 27న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. చరణ్ చేసిన ఈ కామెంట్స్, సినిమా మీద అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories