రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?

Published : Apr 01, 2026, 09:06 PM IST

పాన్ ఇండియా హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం పెద్ది బిజీలో ఉన్న ఆయన.. బాలీవుడ్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇంతకీ ఏం చేయబోతున్నాడు.

PREV
15
దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్

పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గతంలో టాలీవుడ్ కే పరిమితం అయిన రామ్ చరణ్.. ఒక్క సారి మాత్రం బాలీవుడ్ లో సినిమా ప్లాన్ చేసి.. తుఫాన్ సినిమాతో గట్టి దెబ్బ తిన్నాడు. ఆ తరువాత బాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు స్టార్ హీరో. 

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ క్రేజ్ పాన్ ఇండియాకు పాకింది. బాలీవుడ్ లో కూడా చరణ్ కు భారీగా అభిమానులు పెరిగిపోయారు. ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. మరోసారి బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే చరణ్ హీరోగా కాదు నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడుట.

25
నటుడిగా మాత్రమే కాదు..

రామ్ చరణ్ నటుడు మాత్రమే కాదు.. ఆయన నిర్మాతగా, బిజినెస్ మెన్ గా కూడా రాణిస్తున్నాడు. చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా కొన్ని సినిమాలు నిర్మించారు. ఇక చాలా బిజినెస్ లలో చరణ్ ఇన్వెస్ట్ చేశారు. హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇవన్నీ మ్యానేజ్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక తాజాగా ఆయన బాలీవుడ్ లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం అది కూడా నిర్మాతగా బాలీవుడ్ లోకి వెళ్లబోతున్నాడట చరణ్.

35
నిర్మాతగా మెగా పవర్ స్టార్ స్పెషల్ మార్క్..

ఇప్పటికే నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తనదైన ముద్ర వేస్తూ.. వస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన రామ్‌చరణ్, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా నిర్మాతగా అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. 

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, బాలీవుడ్‌లో తొలి ప్రాజెక్ట్ కోసం రామ్‌చరణ్ ఇప్పటికే కొన్ని హిందీ దర్శకులతో సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కథల ఎంపిక విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, మొదటి హిందీ ప్రాజెక్ట్‌ను గ్రాండ్ గా చేయాలని చూస్తున్నట్టు సమాచారం.

45
బాలీవుడ్ లో రామ్ చరణ్ రీ ఎంట్రీ?

అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ టీమ్ ఓ యంగ్ బాలీవుడ్ హీరోను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన కంటెంట్ ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఎవరు ఈ విషయాన్ని కన్ ఫార్మ్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. 

55
నిజమెంత?

ఈ వార్త నిజమైతే, రామ్‌చరణ్ తన పరిధిని టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా బాలీవుడ్‌లో కూడా విస్తరించేందుకు ఇది కీలకమైన అడుగుగా మారనుంది. నటుడిగా ఆస్కార్  వరకు చేరుకున్న రామ్‌చరణ్, నిర్మాతగా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్.

Read more Photos on
click me!

Recommended Stories