Ram Charan: రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం

Published : Sep 19, 2025, 07:28 AM IST

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో తొలిసారి జరుగనున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌)కు రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యారు.

PREV
15
రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం

గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టుడిగా ఎంత ఎదిగారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు రామ్ చ‌ర‌ణ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయిన అతనికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంతకీ అరుదైన గౌరవం ఏంటీ?

25
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్

భారత్‌లో తొలిసారిగా జరగబోయే ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ (APL) కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ (AAI) గురువారం అధికారికంగా ప్రకటించింది. న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్‌ 2 నుంచి 12 వరకు ఈ లీగ్‌ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు నుంచి 36 మంది భారత అగ్రశ్రేణి ఆర్చర్లు, 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ పోటీలు ఫ్లడ్‌లైట్స్ లో ప్రత్యేకమైన వాతావరణంలో జరుగుతాయి. రికర్వ్‌, కాంపౌండ్ విభాగాల్లో డైనమిక్ ఫార్మాట్‌లో ఆర్చర్లు పోటీ పడటం ఈ లీగ్‌కు కొత్త ప్రత్యేకత.

35
రామ్ చరణ్ రియాక్షన్

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ “ఆర్చరీ అనే క్రీడ క్రమశిక్షణ, ఏకాగ్రత, స్థితిస్థాపకతను నేర్పుతుంది. అందుకే ఈ లీగ్‌తో నా అనుబంధం ఏర్పడింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావడం నాకు గర్వంగా ఉంది. ఇది భారత ఆర్చర్లకు గ్లోబల్ స్పాట్‌లైట్‌లో మెరవడానికి పెద్ద వేదిక అవుతుంది. భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు.

45
దసరా కు పెద్ది కానుక

ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న “పెద్ది” సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. అక్టోబర్ 2న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ విడుదల కాబోతోంది. ఈ సినిమాకు “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని వృద్ధి సినిమాస్ పతాకంపై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే 75 రోజులకు పైగా షూటింగ్ పూర్తయింది. ఇంకా 80 రోజుల పాటు చిత్రీకరణ జరగనుంది.

55
పెద్ది విడుదల

“పెద్ది”లో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ “మీర్జాపూర్” ఫేమ్ దివ్యేందు శర్మ, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న (రామ్ చరణ్ పుట్టిన రోజు) సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories