Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 11వ రోజు కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. డిమాన్ పవన్ హౌస్ లో కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యారు.
కింగ్ నాగార్జున హౌస్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 11వ రోజు కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ కంటెండర్స్ పోటీలో భాగంగా బిగ్ బాస్ బజర్ ఆర్ నో బజర్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ ఓనర్స్.. టెనెంట్స్ టెలిఫోన్ లో మాట్లాడుకుంటూ బజర్ నొక్కకుండా ఒకరినొకరు కన్విన్స్ చేసుకోవాలి. అలా కన్విన్స్ కాకుండా బజర్ నొక్కితే టైమర్ లో టైం పెరుగుతుంది. ఈ టాస్క్ లో ఓనర్స్ విజేతలుగా నిలిచారు. ఆ తర్వాత సంజన రీతూ చౌదరికి దొంగచాటుగా ఫుడ్ తినిపించారు. దీనితో ఫుడ్ మానిటర్ అయినా ప్రియాకి సంజనకి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది.
25
సంజనపై ప్రియా ఆగ్రహం
ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఓనర్స్ లో కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేయడానికి అర్హత లేని నలుగురు పేర్లు చెప్పాలని టెనెంట్స్ ని బిగ్ బాస్ ఆదేశించారు. దీనితో టెనెంట్స్ చర్చించుకుని ప్రియా, హరీష్, శ్రీజ, కళ్యాణ్ ల పేర్లు చెప్పారు. దీనితో వారు కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశం కోల్పోయారు. మిగిలిన ముగ్గురు భరణి, మనీష్, డిమాన్ పవన్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. తనకి ఎందుకు అర్హత లేదని నిర్ణయించారో కారణం చెప్పాలని ప్రియా వాగ్వాదానికి దిగింది. పక్షపాత ధోరణి చూపిస్తున్నారని సంజనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
35
ప్రియాని భరించడం కష్టం
దీనితో సంజన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రియా ఫుడ్ మానిటర్ అయితేనే హౌస్ మేట్స్ ఆమెని భరించలేకపోయారు. అలాంటిది కెప్టెన్ గా ఎంపికైతే ఆమెని భరించడం ఇంకా కష్టం. అందుకే ఎంపిక చేయలేదు అని సంజన పేర్కొంది. శ్రీజ కూడా సంజన, ఇమ్మాన్యుయేల్ తో వాగ్వాదానికి దిగింది. భరణి గారికి అనుభవం ఉంది కాబట్టి ఆయన హౌస్ ని బాగా హ్యాండిల్ చేస్తారని ఎంపిక చేసినట్లు సంజన పేర్కొంది.
కెప్టెన్సీ టాస్క్ కి ఎంపికైన భరణి, మనీష్, డిమాన్ పవన్ ముగ్గురూ టెనెంట్స్ నుంచి ఒకరిని ఎంపిక చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీనితో ఈ ముగ్గురూ ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పారు. మొత్తంగా కెప్టెన్సీ టాస్క్ కంటెండర్లుగా భరణి, మనీష్, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ ఎంపికయ్యారు. కెప్టెన్ ని ఎంపిక చేసే కెప్టెన్సీ టాస్క్ కి రీతూ చౌదరి సంచాలకులుగా వ్యవహరించింది. ఈ నలుగురులోనుంచి ఒకరిని కెప్టెన్ గా ఎంపిక చేయడం కోసం రంగు పడుద్ది అనే టాస్క్ నిర్వహించారు.
55
కొత్త కెప్టెన్ గా డిమాన్ పవన్
ఈ టాస్క్ లో భాగంగా నలుగురు కంటెండర్లు ఒక ప్లేస్ లో ఒక్కొక్కరు ఒక్కో కార్నర్ లో ఉండాలి. టాస్క్ మొదలైన తర్వాత ఒకరిపై ఒకరు రంగులు పూసుకోవాలి. బజర్ మోగే సమయానికి ఎవరి టీ షర్ట్ కి ఎక్కువ రంగు ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఆ విధంగా మొదటి రౌండ్ లో మనీష్ అవుట్ అయ్యారు. రెండవ రౌండ్ లో భరణి అవుట్ అయ్యారు. తాను స్టాప్ అని చెబుతున్నప్పటికీ భరణి రంగు పూస్తూనే ఉన్నారని, రూల్స్ బ్రేక్ చేశారని రీతూ ఆరోపించింది. దీనితో భరణిని ఆమె ఎలిమినేట్ చేసింది. చివరికి గేమ్ లో ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్ మిగిలారు. ఇద్దరూ పోటా పోటీగా ఒకరిపై ఒకరు రంగులు పూసుకున్నారు. ఇద్దరి టీ షర్ట్స్ కి రంగు బాగానే అయ్యింది. దీనితో బాగా పరిశీలించిన రీతూ డిమాన్ ఆహ్వానం టీ షర్ట్ కి కాస్త రంగు తక్కువగా ఉందని భావించి అతడిని విజేతగా ప్రకటించింది. దీనితో హౌస్ లో కొత్త కెప్టెన్ గా డిమాన్ పవన్ అవతరించారు.