నేడు ఆర్ఆర్ఆర్ టీం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్, అలియా భట్, నిర్మాత డివివి దానయ్య పాల్గొన్నారు. సెట్స్ లో రాంచరణ్, ఎన్టీఆర్ చేసే అల్లరి చేష్టలు.. వీరిద్దరితో అలియా భట్ ఎలా గడిపింది అనే సరదా ముచ్చట్లని మీడియాతో పంచుకున్నారు. సినిమా విశేషాలు తెలియజేస్తూనే ఈ చిత్ర షూటింగ్ ఎంత సరదాగా సాగిందో తెలిపారు.