Katrina Kaif: కత్రినా, విక్కీ కౌశల్ హల్దీ వేడుక.. నవదంపతుల కెమిస్ట్రీ అదుర్స్, అమేజింగ్ ఫోటోస్ వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 11, 2021, 01:56 PM ISTUpdated : Dec 11, 2021, 01:58 PM IST

అందాల మెరుపుతీగ Katrina Kaif, యువ సంచలనం Vicky Kaushal లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లో వీరిద్దరి వివాహ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. 

PREV
17
Katrina Kaif: కత్రినా, విక్కీ కౌశల్ హల్దీ వేడుక.. నవదంపతుల కెమిస్ట్రీ అదుర్స్, అమేజింగ్ ఫోటోస్ వైరల్

అందాల మెరుపుతీగ Katrina Kaif, యువ సంచలనం Vicky Kaushal లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లో వీరిద్దరి వివాహ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. చాలా కాలంగా కత్రినా, విక్కీ కౌశల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం గురించి కూడా చాలాకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ జంట ఒక్కటయ్యారు. 

 

27

మా ఇద్దరిలో ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలే ఇక్కడి వరకు తీసుకువచ్చాయి. కొత్త జర్నీ ప్రారంభిస్తున్న మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అని కత్రినా వివాహం తర్వాత సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలని షేర్ చేసింది. ఇక వివాహం తర్వాత జరగాల్సిన సంప్రదాయ వేడుకలు జరుగుతున్నాయి. 

37

తాజాగా కత్రినా, విక్కీ కౌశల్ హల్దీ వేడుక జరిగింది. సౌత్ లో దీనిని మంగళస్నానాలుగా పిలుస్తారు. హల్దీ వేడుకకి సంబందించి అద్భుతమైన ఫోటోలని కత్రినా, విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోస్ చాలా అందంగా ఉన్నాయి. నవదంపతులు మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. 

47

కత్రినా తన ప్రేమని మొత్తం రంగరించి విక్కీ కౌశల్ ని పసుపులో ముంచెత్తుతోంది. ఒంటినిండా పసుపుతో ఇద్దరూ మెరిసిపోతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ సంతోషంలో మునిగితేలుతున్నారు. కత్రినా, విక్కీ లని ఇలా చూస్తూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

57

ఈ వేడుకలో కత్రినా, విక్కీ ఇద్దరి కుటుంబ సభ్యులు సంతోషంగా పాల్గొనడం ఫొటోస్ లో కనిపిస్తోంది. కత్రినా, విక్కీ మధ్య ప్రేమ ఎంత ఘాడంగా ఉందో ఈ దృశ్యాలని చూసి తెలుసుకోవచ్చు. 

 

67

బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లకు సమానంగా కత్రినా క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ దశలో కత్రినా ఐశ్వర్యారాయ్ కంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా సంచలన సృష్టించింది.   

77

ఇక విక్కీ కౌశల్ ఉరి చిత్రంతో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బ్రేవ్ సోల్జర్ గా ఉరి చిత్రంలో విక్కీ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఇటీవల విక్కీ కౌశల్ 'సర్దార్ ఉద్ధం' చిత్రంలో నటించాడు. Also Read: RRR Movie: నాపై చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు.. వైరల్ అవుతున్న అలియా భట్ కామెంట్స్

click me!

Recommended Stories