కాళ్ళు లేని వ్యక్తిగా రాంచరణ్, డ్యూయెల్ రోల్ లో కబడ్డీ.. బుచ్చిబాబు మూవీ స్టోరీ లీక్ ?

Published : Apr 14, 2023, 08:16 PM IST

ఇక శంకర్ మూవీ తర్వాత రాంచరణ్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కథకి ఓకె చెప్పారు. బుచ్చిబాబు, చరణ్ చిత్రం గురించి చాలా రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి.

PREV
16
కాళ్ళు లేని వ్యక్తిగా రాంచరణ్, డ్యూయెల్ రోల్ లో కబడ్డీ.. బుచ్చిబాబు మూవీ స్టోరీ లీక్ ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజెర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం ఇదే. శంకర్ మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 తో బిజీగా ఉండడం వల్ల రాంచరణ్ మూవీ ఆలస్యం అవుతోంది. ఇక శంకర్ మూవీ తర్వాత రాంచరణ్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కథకి ఓకె చెప్పారు. 

26

బుచ్చిబాబు, చరణ్ చిత్రం గురించి చాలా రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలు నిజమైనట్లు బలమైన సంకేతాలు వస్తున్నాయి. అంతే కాదు ఈ చిత్రానికి జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

 

36

అన్నింటికీ మించి ఈ చిత్ర మెయిన్ ప్లాట్ గురించి అదిరిపోయే న్యూస్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో రాంచరణ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు 1980నేపథ్యంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. 

46

కబడ్డీ ఆట ప్రధానాంశంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చాలా చిత్రాలు కబడ్డీ నేపథ్యంలో వచ్చాయి. కానీ బుచ్చిబాబు ఈ చిత్రాన్ని కంప్లీట్ డిఫెరెంట్ లెవల్ లో గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కించే  సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

56

ఈ చిత్రంలో రాంచరణ్ కాళ్ళు కోల్పోయిన అన్న పాత్రలో.. అలాగే ఆంధ్ర కబడ్డీ టీం కెప్టెన్ గా తమ్ముడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మెయిన్ ప్లాట్ చూస్తుంటే.. అన్న కలని సాకారం చేసే తమ్ముడి  చిత్రంగా రెగ్యులర్ స్టోరీలానే అనిపిస్తోంది. కానీ కథనం, ప్రతి సన్నివేశం టాప్ నాచ్ గా ఉండేటట్లు బుచ్చిబాబు స్టోరీ రాసుకునట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. 

66

రాంచరణ్ కూడా ఇటీవల జాతీయ మీడియా సమావేశంలో బుచ్చిబాబు చిత్రం గురించి చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడారు. రంగస్థలం తర్వాత తన కెరీర్ లో మరో గొప్ప చిత్రం అయ్యే కథ ఇది అని తెలిపారు. సుకుమార్ రంగస్థలం చిత్రంలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటించాడు. బుచ్చిబాబు ఉప్పెనలో హీరో పాత్రకి చివర్లో ఒక లోపం ఎమోషనల్ గా బయట పడుతుంది. మరోసారి అదే ట్రెండ్ కొనసాగబోతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories