మెహందీ చేతులను చూపిస్తూ అంజలి సంతోషం.. శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్.. విషయం ఏంటంటే?

First Published | Apr 14, 2023, 6:57 PM IST

తెలుగు హీరోయిన్ అంజలి (Anjali) తాజాగా పంచుకున్న ఫోటోల్లో బ్యూటిఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అయితే మెహందీ చేతులను చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
 

తెలుగు గ్లామరస్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకొని వెండితెరపై అలరిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆఫర్లు అందుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విభిన్న పాత్రలు పోషిస్తుంది.
 

అంజలి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే కనిపిస్తుంది. తన వ్యక్తిగత విషయాలను సినిమా విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని ఫోటోలను పంచుకుంది. బ్యూటిఫుల్ తో తెలుగు భామ ఆకట్టుకుంటుంది. 
 


అయితే, అంజలి మెహందీ పెట్టుకున్న చేతులను ఫాన్స్ కు చూపిస్తూ ఫోటోలను షేర్ చేసుకుంది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు, నెటిజెన్లు విషయం ఏంటని చూస్తున్నారు. కాగా ఈరోజు తమిళ కొత్త సంవత్సరం కావడంతో అంజలి నెట్టింట ఇలా దర్శనం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫోటోలను పంచుకుంది.
 

ప్రస్తుతం తమిళంలోనూ సినిమాల పరంగా వెబ్ సిరీస్ ల పరంగా అవకాశాలను అందుకుంటున్న అంజలి.. తమిళ ప్రేక్షకులకు తన అభిమానులకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమె పోస్టులు చూసిన తమిళ ఫ్యాన్స్ తిరిగి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 

లేటెస్ట్ పిక్స్ లో అంజలి వైట్ టాప్, రెడ్ డిజైన్ లెహంగా ధరించి బ్యూటిఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఫోటోలకు కొంటెగా ఫోజులిచ్చింది. చేతులు చూపించడంతోపాటు.. ఫ్యాన్స్ కి స్సెస్ ఇస్తూ ఆకట్టుకుంది. దీంతో అభిమానులు ఆమె అందాన్ని పొగుడుతున్నారు. రకరకాల కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

తెలుగులో చివరిగా నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలో స్పెషల్ డాన్స్ తో అంజలి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాట హిట్ అవడంతో అంజలి క్రేజ్ పెరిగింది. రీసెంట్ గా తమిళంలో ఝాన్సీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం మరో వెబ్ సిరీస్ తో పాటు సినిమాల్లో నటిస్తోంది. రామ్ చరణ్ 'గేమ్ చేంజర్'లో కీలక పాత్రలో అలరించబోతోంది.

Latest Videos

click me!