Ram Charan
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో రూపొందుతోంది. కాగా మార్చి 27న రాంచరణ్ తన 40వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. చరణ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాంచరణ్ కెరీర్ గురించి, సినిమాల గురించి ఫ్యాన్స్ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
చిరుతతో ఎంట్రీ
దాదాపు 17 ఏళ్ళ క్రితం 2007లో రాంచరణ్ చిరుత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత మూవీ సూపర్ హిట్ అయింది. చరణ్ కి గ్రాండ్ ఎంట్రీ లభించింది. ఈ చిత్రంలో రాంచరణ్, నేహా శర్మ జంటగా నటించారు. చిరుత మూవీ షూటింగ్ సమయంలో చరణ్, నేహా శర్మ గురించి అనేక రూమర్స్ వచ్చాయి. చరణ్ ఆ టైంలో తొలిసారి ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది.
హీరోయిన్ లవ్ ఎఫైర్, చిరంజీవి రియాక్షన్
నేహా శర్మ, చరణ్ మధ్య ప్రేమ చిగురించింది అని వీరిద్దరూ జంటగా గడుపుతున్నారు అంటూ అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ కలసి ఫారెన్ వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ గురించి తనకి, తన కుటుంబానికి కూడా తెలిసింది అని రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేను షాక్ అయ్యాను. నాన్న చిరంజీవి గారికి కూడా ఈ విషయం తెలిసింది. ఆ టైంలో అమ్మా నాన్న నాతో ఒకే ఒక్క మాట చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటి రూమర్స్ సహజం, కంగారు పడొద్దు అని చెప్పారు.
chiranjeevi
నిజమైన ప్రేమ ఎప్పుడు మొదలైంది అంటే..
అవి కేవలం రూమర్స్ మాత్రమే. ఎలాంటి వాస్తవం లేదు అని రాంచరణ్ తెలిపారు. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు మొదలైందో రాంచరణ్ రివీల్ చేశారు. పెళ్ళికి ముందు ఏడేళ్లుగా నాకు ఉపాసనతో పరిచయం ఉంది. నార్మల్ ఫ్రెండ్స్ లాగే ఇద్దరం ఉన్నాం. ఎప్పుడూ మా మధ్య ప్రేమ గురించి ఆలోచించలేదు. కానీ పెళ్ళికి ఏడాది ముందు ఆమెపై ప్రేమ మొదలైంది. అప్పుడే తనకి ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేసిన వెంటనే ఉపాసన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వెంటనే నాన్నగారితో చెప్పాను. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, సంబంధం కుదరడం చక చకా జరిగిపోయాయి అని రాంచరణ్ తెలిపారు.
ఉపాసనకి మీరు హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటారనే డౌట్ లేదా అని ప్రశ్నించగా.. ఉపాసన పెళ్ళికంటే ముందు నా ఫ్రెండ్. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్స్ ఉంటాయి అనేది ఉపాసనకు కూడా తెలుసు. కాబట్టి రూమర్స్ ని ఉపాసన పట్టించుకోదు అని రాంచరణ్ తెలిపారు.