ఐశ్వర్య రాయ్ కారు ప్రమాదం: నిజమెంత? ఏం జరిగింది?
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కారు ప్రమాదానికి గురైందన్న వార్త వైరల్ అయింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్య కారులో లేరని సమాచారం.
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కారు ప్రమాదానికి గురైందన్న వార్త వైరల్ అయింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్య కారులో లేరని సమాచారం.
రీసెంట్ గా సోనూసూద్ సతీమణి సోనాలి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న వాహనం నాగపూర్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టగా, అదృష్టవశాత్తు గాయాలతో బయటపడింది.
ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కారు రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఐష్ కారును ఓ బస్సు ఢీ కొట్టినట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.
అసలు ఏం జరిగింది అనేది అభిమానుల్లో ఆందోళనతో పాటు, చర్చనీయాశంగా మారింది.
ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai Bachchan) కారు స్వల్ప ప్రమాదానికి గురైందనేది నిజం. అయితే కారు మాత్రమే యాక్సిడెంట్ కు గురైంది. వెనుక నుంచి వచ్చిన ఓ బస్సు కారును ఢీకొట్టినట్టు వార్తలొచ్చాయి.
ఆ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అది చూసిన పలువురు అభిమానులు ఐశ్వర్యకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఆ సమయంలో ఐశ్వర్యా రాయ్ కారులో లేరని సమాచారం. పెద్ద ప్రమాదమేమీ చోటుచేసుకోలేదని ఐశ్వర్యా రాయ్ టీమ్ స్థానిక మీడియాకు వెల్లడించినట్టు తెలిసింది.
బస్సు కారును ఢీకొట్టిన తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయిందట. ఇక ప్రమాదం తర్వాత కారుని అక్కడే వదిలేసి వెళ్లినట్టు తెలుస్తుంది.
ఐశ్వర్య రాయ్ కి చెందిన అన్ని కార్లకు 5050 అనే నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందట. అది ఆమె లక్కీ నెంబర్. అందుకే, ఆమె కారుని సులువుగా గుర్తుపట్టారు ఆమె అభిమానులు.
మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” చిత్రాల తర్వాత ఐశ్వర్య రాయ్ మళ్ళీ సినిమాల్లో నటించలేదు.