వ్యక్తులుగా ప్రతి ఒక్కరికి సొంత ఆలోచనలు ఉంటాయి. అదే విధంగా వాళ్లిద్దరూ వేరు వేరు పార్టీలో ఉన్నారు. అంతమాత్రాన ఏదో జరిగిపోయింది అని అంటున్నారు. అన్నదమ్ములుగా, పర్సనల్ గా బాబాయ్, నాన్న మధ్య చిన్న పొరపొచ్చాలు కూడా లేవు. వాళ్లిద్దరూ బ్లడ్ బ్రదర్స్ అని చరణ్ బదులిచ్చాడు. అన్నదమ్ములుగా వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా జరిగితే అది వాళ్ళిద్దరి మధ్యే ఉంటుంది. మా దాకా రాదు. మూడో వ్యక్తికి అవకాశం లేదు అంటూ రాంచరణ్ ఆ సమయంలో చాలా హుందాగా సమాధానం ఇచ్చారు.