Ram Charan Rare Photos : మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఫొటోలు.. చెర్రీని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు

Published : Mar 27, 2024, 03:32 PM IST

ఈరోజు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన రేర్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

PREV
113
Ram Charan Rare Photos : మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఫొటోలు.. చెర్రీని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు (Ram Charan Birthday) నేడు ఘనంగా జరుగుతున్నాయి.  

213

చరణ్ 39వ బర్త్ డే సెలబ్రేషన్స్ ను మెగా అభిమానులు, చెర్రీ ఫ్యాన్స్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చరణ్ కు విషెస్ తెలుపుతున్నారు.

313

ఈరోజు చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా తన కుటుంబ సమేతంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు.

413

పట్టువస్త్రాలు ధరించి భార్య ఉపాసన కొణిదెల (Upasana Konidela), కూతురు క్లింకార (Klin Kaara)తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. 

513

ఇప్పటికే కుటుంబ సమేతంగా చరణ్ తిరుమలలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

613

అలాగే ఈరోజు చరణ్ పుట్టిన రోజున సందర్భంగా చెర్రీకి సంబంధించిన అరుదైన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

713

చరణ్ చిన్నప్పటి నుంచి ఎదిగే క్రమంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో దిగిన ఫొటోలు ఇక్కడ చూడొచ్చు.

813

ఈ అరుదైన చిత్రాలను బహుశా చరణ్ అభిమానులు కూడా గతంలో చూసి ఉండరు. బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ అనే చెప్పాలి. 

913

ఇక ప్రస్తుతం చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ ఫొటోస్ బయటికి వచ్చాయి. చరణ్ చిన్నతనంలో ఎలా ఉన్నాడో చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

1013

రామ్ చరణ్ ను మెగాస్టార్ చిరంజీవి ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నారో చూపించే ఈ చిత్రాలు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లకు ఎమోషనల్ గా టచ్ అయ్యాయి. 

1113

ప్రతి చోట చిరంజీవి వెంట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తున్నారు. దీని బట్టి చెర్రీ లేకుండా చిరు ఎక్కడి వెళ్లేవాడు కాదేమో అనిపిస్తోంది.

1213

అలాగే ఇండియాలో పలు ఫేమస్ ప్రాంతాలతో పాటు, చిరు షూటింగ్ స్పాట్లకు కూడా చరణ్ ను తీసుకెళ్లేవాడని ఫొటోలను చూస్తే అర్థమవుతోంది.

1313

ఇక చరణ్ కు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే కూడా ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే. పవర్ స్టార్ తోనూ చెర్రీ చిన్నప్పటి అరుదైన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.

click me!

Recommended Stories