సూర్య నుండి పృథ్విరాజ్ చేతికి, ఏళ్ల తరబడి డిలే... ది గోట్ లైఫ్ తెరపైకి రావడానికి ఇంత తతంగం జరిగిందా!

First Published Mar 27, 2024, 2:02 PM IST

మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. తాజాగా ది గోట్ లైఫ్ అనే సర్వైవల్ థ్రిల్లర్ చేశాడు. ది గోట్ లైఫ్ తెర పైకి రావడానికి పెద్ద యుద్ధమే జరిగింది... 
 

The Goat Life Movie

ది గోట్ లైఫ్ సర్వైవల్ థ్రిల్లర్. ఈ జోనర్లో ఇండియాలో చిత్రాలు తెరకెక్కింది చాలా తక్కువ. పలు భాషల్లో భారీగా విడుదల చేస్తున్నారు. మార్చి 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. పృథ్విరాజ్ సుకుమార్, అమలా పాల్ ప్రధాన పాత్రలు చేశారు. ది గోట్ లైఫ్ మూవీ తెరపైకి రావడానికి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. 

The Goat Life Movie

ది గోట్ లైఫ్ ఒక నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ మలయాళ రచయిత బెనియమిన్ అలియాస్ బెన్నీ డానియల్ రాసిన ఆడుజీవితం అనే నవలను ది గోట్ లైఫ్ టైటిల్ తో సినిమాగా తెరకెక్కించారు. ఈ నవల వాస్తవ సంఘటనల ఆధారంగా రాయడమైంది. నజీబ్ మహ్మద్ అనే వ్యక్తి సౌదీ అరేబియా ఎడారిలో గొర్రెల కాపరిగా దుర్భర జీవితం అనుభవిస్తాడు. ఈ సినిమా నజీబ్ అనే పాత్ర ప్రధానంగా సాగుతుంది. 

The Goat Life Movie

ది గోట్ లైఫ్ చిత్రానికి బ్లేస్సి దర్శకుడు. ఈయన 2008లో ఈ ప్రాజెక్ట్ గురించి పృథ్విరాజ్ సుకుమార్ కి చెప్పడం జరిగింది. మొదట సూర్యతో చేయాలి అనుకున్నారు. అయితే అప్పటికే సూర్య పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. దాంతో సున్నితంగా తిరస్కరించారు. అలా ది గోట్ లైఫ్ ప్రాజెక్ట్ పృథ్విరాజ్ సుకుమారన్ వద్దకు వెళ్ళింది. ఆయన ఓకే చేశారు. 

The Goat Life Movie

2010లో ది గోట్ లైఫ్ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే బడ్జెట్ పరిమితుల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. ఒక మలయాళ సినిమాకు దర్శకుడు బ్లేస్సి కోరిన బడ్జెట్ సమకూర్చడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. ది లైఫ్ ఆఫ్ పై తరహాలో విజువల్ వండర్ గా ది గోట్ లైఫ్ ని తెరకెక్కించాలని బ్లేస్సి భావించారు. త్రీడీ ఫార్మాట్ లో షూట్ చేయడం సినిమాకు ప్లస్ అవుతుందని అనుకున్నారు. 
 

The Goat Life Movie

ది గోట్ లైఫ్ మూవీ కోసం పృథ్విరాజ్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాధించాల్సి వచ్చింది. ఈ కథలోని ప్రధాన పాత్ర నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. చివరికి ఏడాదిలో గొర్రెలు కాస్తూ బానిస కావాల్సి వస్తుంది.  ఈ నజీబ్ మొదట పొట్టతో ఫ్యాట్ గా ఉంటాడు. బానిస అయ్యాక బక్కచిక్కిపోతాడు. ఈ రెండు షేడ్స్ చూపించడానికి పృథ్విరాజ్ 30 కేజీలు బరువు తగ్గాడు. 

The Goat Life Movie

నిర్మాతలు ముందుకు రాకపోవడంతో దాదాపు 16 ఏళ్ల తర్వాత బ్లేస్సి అనుకున్న ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది. ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. దర్శకుడు బ్లేస్సి, జిమ్మీ జీన్ లూవిస్, స్టీవెన్ ఆడమ్స్ నిర్మించారు. 

The Goat Life trailer

నజీబ్ ఏళ్ల తరబడి ఒంటరిగా గొర్రెలతో జీవిస్తాడు. విశాలమైన ఎడారిలో గొర్రెలే అతని సావాసం. ఈ పాత్ర కోసం జంతువుల సైకాలజీ, వాటితో ప్రవరించే విధానం వంటి విషయాలు పృథ్విరాజ్ నేర్చుకున్నాడట. ది గోట్ లైఫ్ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మరి దర్శకుడి భగీరథ ప్రయత్నం ది గోట్ లైఫ్ ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి... 

click me!