45 ఎకరాల లగ్జరీ రిసార్ట్ లో రకుల్ పెళ్లి.. ఒక్కో రూమ్ కి రెంట్ ఎంతో తెలుసా, దిమ్మ తిరిగే డీటెయిల్స్

Published : Feb 16, 2024, 02:59 PM IST

రకుల్, భగ్నానీ పెళ్లి వేడుక సౌత్ గోవా లోని ఐటీసీ గ్రాండ్ గోవా అనే ఫైవ్ స్టార్ హోటల్ లో జరగబోతోంది. ఈ లగ్జరీ రిసార్ట్ మొత్తం 45 ఎకరాల్లో ఉంటుంది.

PREV
17
45 ఎకరాల లగ్జరీ రిసార్ట్ లో రకుల్ పెళ్లి.. ఒక్కో రూమ్ కి రెంట్ ఎంతో తెలుసా, దిమ్మ తిరిగే డీటెయిల్స్

  టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి టాప్ స్టార్స్ తో నటించింది. కొంతకాలం రకుల్ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది. కానీ ఒక్కసారిగా ఆమెకి అవకాశాలు పడిపోయాయి. బాలీవుడ్ లో కూడా రకుల్ కి కలసి రాలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంది. 

27

బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే మరికొన్ని రోజుల్లో తమ ప్రేమని రకుల్, జాకీ భగ్నానీ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళబోతున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో రకుల్, భగ్నానీ వివాహం జరగబోతోంది.  

37

మూడు రోజుల పెళ్లి వేడుక చాలా గ్రాండ్ గా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ గెస్ట్ లకు ఇన్విటేషన్స్ అందించారు. తాజాగా పెళ్లి వేదిక గురించి కూడా ఆసక్తికర వివరాలు బయటకి వచ్చాయి. రకుల్, భగ్నానీ పెళ్లి వేడుక సౌత్ గోవా లోని ఐటీసీ గ్రాండ్ గోవా అనే ఫైవ్ స్టార్ హోటల్ లో జరగబోతోంది. 

47

ఈ లగ్జరీ రిసార్ట్ మొత్తం 45 ఎకరాల్లో ఉంటుంది. మొత్తం 246 రూమ్స్ రూమ్స్ ఉన్నాయట. ఒక్కో రూమ్ రెంట్ 19 వేల నుంచి 75 వేల వరకు ఉంటుందని  చెబుతున్నారు. బీచ్ పక్కనే ఎంతో అందంగా ఈ రిస్టార్ ని నిర్మించారు. ఇండియా పోర్చుగీస్ విలేజ్ స్టైల్ లో రిసార్ట్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. 

57

రిసార్ట్ నుంచి నేరుగా బీచ్ లొకేషన్ కి వెళ్లొచ్చు. మొత్తంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చాలా గ్రాండ్ గా.. ఎలాంటి పొల్యూషన్ కి తావులేకుండా జరగబోతున్నట్లు తెలుస్తోంది. రూమ్ రెంట్ 75 వేల వరకు ఉంటుందంటే.. ఎన్ని రూమ్స్ బుక్ చేశారు అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే రకుల్ పెళ్లి మొత్తం 3 రోజుల పాటు జరగనుననట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రకుల్ పెళ్లి ఖర్చు ఒక రేంజ్ లో ఉండబోతోందని అర్థం చేసుకోవచ్చు. 

67

  రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్, భగ్నానీ పెళ్లి గోవాలో జరగబోతోంది. అందుకు తగ్గట్లుగా శుభలేఖలో కూడా గోవా అందాలు కనిపించేలా ముద్రించారు. పెళ్లి కార్డుపైన కొబ్బరి చెట్లు, బీచ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి.   

77

  మూడు రోజులకు ముగ్గురు డిజైనర్స్ ని ఎంపిక చేశారు. సబ్యసాచి, తరుణ్ తహిల్యాని, మనీష్ మల్హోత్రా ఇలా ముగ్గురు డిజైనర్లు రెడీ చేసిన వస్త్రాలని రకుల్, భగ్నానీ ధరించబోతున్నారు. పెళ్లి తర్వాత కూడా రకుల్ సినిమాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.   

click me!

Recommended Stories