బాలీవుడ్‌లో ఇప్పుడు ఆమె చేతిలో అరడజనుకుపైగా చిత్రాలుండటం విశేషం. అయితే తెలుగులో కంటే బాలీవుడ్‌లో గ్లామర్ పోత విషయంలో హద్దులు చెరిపేస్తుంది రకుల్. అక్కడ మరింతగా రెచ్చిపోతూ హిందీ ఆడియెన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్‌లో `ఎటాక్`, `రన్‌వే 34`, `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `అయలాన్`, `మిషన్ సిండ్‌రెల్లా`, `చట్రివాలి`, `31అక్టోబర్ లేడీస్ నైట్` చిత్రాలు చేస్తుంది. ఈ చిత్రాలన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఓ రకంగా రకుల్ సినిమాల జాతర కొనసాగబోతుందని చెప్పొచ్చు.