Rakul Preet Singh: రెట్రో లుక్‌లో మత్తెక్కిస్తున్న రకుల్‌.. బర్త్‌ డే పిక్స్ తో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్‌

Published : Nov 08, 2021, 05:28 PM ISTUpdated : Nov 08, 2021, 05:36 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బర్త్ డే పిక్స్ పంచుకుంది. నెల రోజుల తర్వాత తన పుట్టిన రోజు ఫోటోలను పంచుకుని షాక్‌కి గురి చేసింది. ఊహించిన విధంగా బర్త్ డే పిక్స్ రావడంతో నెటిజన్లతోపాటు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
17
Rakul Preet Singh: రెట్రో లుక్‌లో మత్తెక్కిస్తున్న రకుల్‌.. బర్త్‌ డే పిక్స్ తో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్‌

ఇటీవల రెట్రో లుక్‌లో కనిపించి ఫిదా చేసింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh). టూ పీస్‌ బికినీని పోలిన స్లీవ్‌లెస్‌ టాప్‌లో పరువాల విందు వడ్డించింది. తలపై హెయిర్‌కి క్లాత్‌ కట్టుకుని, ఓల్డ్ లుక్‌ గ్లాసెస్‌తో ఈ అమ్మడు పంచుకున్న పిక్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టుంది. Rakul Preet Singh బెల్లీ అందాలనుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. 

27

ఈ క్రమంలో రకుల్ అభిమానులకు మరో షాకిచ్చింది. తన బర్త్ డే ఫోటోలను(Rakul Preet Singh Birthday pics) పంచుకుంది. క్యూట్‌ అందాలతో ఫోటోలకు పోజులిస్తూ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది రకుల్. `దాదాపు నెల రోజులు గడిచిపోయాయి. కానీ ఇది పెద్ద ఆలస్యంకాదు. సూపర్‌ ఫన్‌, ప్రేమకి కృతజ్ఞతలు` అని పేర్కొంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

37

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ రాణించింది. అగ్ర హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. రెండేళ్ల వరకు తెలుగులో స్టార్‌ హీరోలకు బెస్ట్ అప్షన్‌. కమర్షియల్‌ సినిమాలకు మొదటి ఛాయిస్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌. దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడింది రకుల్. మహేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రవితేజ, గోపీచంద్‌, రామ్‌, నితిన్‌ ఇలా యంగ్‌ హీరోల నుంచి స్టార్ల వరకు ఆమె ఆడిపాడింది. Rakul Preet Singh Birthday pics.

47

అయితే రకుల్‌ నటించిన సినిమాల్లో సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువయ్యాయి. `కరెంట్‌ తీగ`, `కిక్‌2`, `బ్రూస్‌లీ`, `విన్నర్‌`, `జయజనాకీ నాయక`, `స్పైడర్‌`, `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`, `మన్మథుడు2`,`చెక్‌`, `కొండపొలం` చిత్రాలతో పరాజయాలను చవిచూసింది. 
 

57

రకుల్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా, గ్లామర్‌ పాత్రలకే పరిమితమయ్యింది. నటిగా తనని తాను ఆవిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. అందాల ఆరబోతకే ప్రయారిటీ ఇచ్చిందనే విమర్శ కూడా ఉంది. అదే రకుల్‌ కెరీర్‌ని ట్రాక్‌ తప్పేలా చేసిందనే టాక్‌ వచ్చింది. అయితే తెలుగులో సినిమాలు లేకపోవడానికి ఇదే కారణమే టాక్‌ ఉంది. కానీ ఇలాంటి విమర్శలను ఖండించింది రకుల్. 
 

67

తాను హిందీలో బిజీగా ఉండటం వల్ల తెలుగులో టైమ్‌ ఇవ్వలేకపోతున్నానని చెబుతుంది. లైఫ్‌ ఇచ్చిన టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్‌ వెంట పరిగెత్తడంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ప్రస్తుతం రకుల్‌ ఫోకస్‌ మొత్తం బాలీవుడ్‌పైనే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె హిందీలోనే దాదాపు ఐదారు సినిమాలు చేయడం విశేషం. 
 

77

హిందీలో ప్రస్తుతం రకుల్‌ `ఎటాక్‌` చిత్రంలో జాన్‌ అబ్రహాంతో కలిసి నటిస్తుంది. `మేడే` చిత్రంలో అజయ్‌ దేవగన్‌, అమితాబ్‌ బచ్చన్‌లతో నటిస్తుంది. `థ్యాంక్‌ గాడ్‌`లో అజయ్‌ దేవగన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి నటిస్తుంది. ఆయూష్మాన్‌ ఖురానాతో కలిసి `డాక్టర్‌ జీ` చిత్రంలో నటిస్తుంది. ఇదే కాకుండా `మిషన్‌ సిండెరెల్లా`లో నటిస్తుంది. అలాగే `ఛత్రివాలి` అనే మరో బాలీవుడ్‌ సినిమాల చేస్తుంది రకుల్. ఇలా ఇప్పుడు ఏకంగా ఆరు హిందీ సినిమాలు చేస్తుండటం విశేషం. దీంతోపాటు తెలుగు, తమిళం బైలింగ్వల్‌ `అక్టోబర్‌ 31ఫస్ట్ లేడీస్‌ నైట్‌` సినిమాలో నటిస్తుంది. 

also read: Jahnvi kapoor:హాట్ థైస్ క్లీన్ క్లీవేజ్.. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్, ప్రైవేట్ పార్టీలో జాన్వీ కపూర్ బీభత్సమ్

Read more Photos on
click me!

Recommended Stories