వసు కోసం వచ్చిన శిరీష్.. ఏకంగా రిషినే ఆ మాట అడగడంతో కోపంతో?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 08, 2021, 04:25 PM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

PREV
19
వసు కోసం వచ్చిన శిరీష్.. ఏకంగా రిషినే ఆ మాట అడగడంతో కోపంతో?

వసుధార (Vasudhara) క్లాస్ కు రిషి (Rishi) ఇంకా రాకపోవటంతో తానే క్లాస్ చెబుతుంది. అంతే కాకుండా కాస్త ఓవర్ గా ప్రవర్తించటంతో అప్పుడే రిషి సార్ వచ్చి తను చేస్తున్న ఓవర్ యాక్టింగ్ ను చూస్తూ సైలెంట్ గా ఉండిపోతాడు. పుష్ప వసు ఓవర్ యాక్టింగ్ చూసి టెన్షన్ పడుతుంది.

29

ఇక రిషి (Rishi) ని చూసి షాక్ అవుతుంది. రిషి వచ్చి క్లాస్ పీకినట్లుగా మాట్లాడతాడు. రిషి ఏమనలేక సైలెంట్ గా ఉండిపోతుంది. ఏం శిక్ష ఇస్తారో ఇవ్వండి అంటూ వసు (Vasu) మాట్లాడేసరికి రిషి కోపం వచ్చి తననే క్లాస్ చెప్పమని చెప్పి క్లాస్ నుంచి వెళ్ళిపోతాడు.

39

మరోవైపు జగతి (Jagathi) , మహేంద్ర వర్మ (Mahendra) ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతుంటారు. అప్పుడే శిరీష్ కాలేజ్ కు రావటం తో మహేంద్ర వర్మ శిరీష్ ను చూసి షాక్ అవుతాడు. శిరీష్ వచ్చి రిషి సార్ ను కలవాలి అనేసరికి మహేంద్ర వర్మ ఏం చేయాలో అర్థం కాక తపనపడతాడు.

49

అసలు విషయం ఎక్కడ బయటపెడతాడు అన్న భయంతో మహేంద్ర వర్మ శిరీష్ (Sireesh) తో పాటు రిషి క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. ఇక రిషి శిరీష్ ను చూసి కోపంతో రగిలిపోతాడు. మహేంద్ర వర్మ (Mahendra varma) మాత్రం తన మనసులో ఇప్పుడైనా నిజం చెబుతాడేమోనని ఆశపడుతుంటాడు.

59

శిరీష్ రిషి (Rishi) తో మాట్లాడుతూ ఒక హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. ఏంటి అని రిషి అడగటంతో పెళ్లి గురించి ఊరికి వెళ్లాలి అని వసు ను పంపించమని అనటంతో వెంటనే వసుని (Vasu) పిలిపిస్తాడు.

69

మహేంద్ర వర్మ తన మనసులో వసు (Vasu) రాగానే శిరీష్ నిజం చెబుతాడని అప్పుడైనా రిషి అసలు నిజం బయట పెడతాడని అనుకుంటాడు. ఇక వసు రావడంతో శిరీష్ ను చూసి షాక్ అవుతుంది. వసు సార్ అని పిలవడంతో రిషి (Rishi) పర్మిషన్ ఇస్తున్నానని చెప్పి వెళ్ళిపోమని అంటాడు.

79

ఇక శిరీష్ (Sireesh) రిషితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా వసు శిరీష్ చెయ్యి పట్టుకుని బయటికి తీసుకు వెళుతుంది. మహేంద్ర వర్మ (Mahendra) ఏమీ అనలేక సైలెంట్ గా ఉండిపోతాడు. బయట వసు, శిరీష్ మాట్లాడటంతో వాళ్లను చూస్తూ రగిలిపోతాడు.
 

89

ఇక వసు (Vasu) రెస్టారెంట్ లో రిషి కోసం ఎదురుచూస్తుంది. రిషి (Rishi) రెస్టారెంట్ బయట వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గతంలో వసు చదువు గురించి మాట్లాడిన మాటలు తలుచుకొని ప్రశ్నలు వేసుకుంటాడు.

99

ఇక తరువాయి భాగంలో వసు (Vasu) రిషి కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మీరు ఎందుకో ఇక్కడే ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది అని అనడంతో రిషి (Rishi) ఆశ్చర్యపడినట్లు కనిపిస్తాడు.
 

click me!

Recommended Stories