లేడీ బాస్‌ లుక్‌లో రకుల్‌.. వైట్‌ అండ్‌ వైట్‌ కోట్‌లో హాట్ బ్యూటీ నయా ట్రీట్‌..

Published : Aug 16, 2023, 10:15 PM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌.. బాలీవుడ్‌కే పరిమితమైంది. టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన ఈ భామ ఇప్పుడు హిందీకే పరిమితమైంది. కానీ సోషల్‌ మీడియా ద్వారా అందరికి టచ్‌లోనే ఉంటుందీ బ్యూటీ. 

PREV
18
లేడీ బాస్‌ లుక్‌లో రకుల్‌.. వైట్‌ అండ్‌ వైట్‌ కోట్‌లో హాట్ బ్యూటీ నయా ట్రీట్‌..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఇటీవల ఈ అమ్మడి జోరు తగ్గింది. గత ఏడాదికి ముందు నుంచి సామాజిక మాధ్యమాల్లో గ్యాప్‌ లేకుండా కనిపించింది. రోజుకు రెండు మూడు సార్లు ఫోటో షూట్లు చేసి వాటిని అభిమానులతో పంచుకుంది. గ్యాప్‌ లేకుండా అందాల దాడి చేసి ఆకట్టుకుంది. 
 

28

గ్లామర్‌ ట్రీట్‌తో నెటిజన్లని అలరించడంతోపాటు తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. తనకు అభిమానులుగా మార్చుకుంది. ఇటీవల అడపాదడపా స్పందిస్తుంది. గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది. అందులో భాగంగా తాజాగా మెరిసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాతో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు వైట్‌ అండ్‌వైట్‌లో మెరిసింది. 
 

38

వైట్‌ కోట్‌, ఫ్యాంట్‌ ధరించి లేడీ బాస్‌లా పోజులిచ్చింది. చిలిపి నవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది. ప్లజెంట్‌ లుక్‌లో మెస్మరైజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ హాట్‌ హీరోయిన్‌ పంచుకున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ తమ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే ఇందులో రకుల్‌ సరికొత్తగా కనిపిస్తుంది. నయా ట్రీట్‌ అదిరిపోయిందనేలా ఉంది. 

48

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది రకుల్ ప్రీత్‌ సింగ్‌. ఎన్నో సూపర్‌ హిట్లలో భాగమైంది. అదే సమయంలో అనేక పరాజయాలను కూడా చవి చూసింది. కానీ ఎప్పుడూ రకుల్‌ డౌన్ కాలేదు. సినిమా సినిమాకి తన రేంజ్‌ని పెంచుకుంది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచింది. 
 

58
Rakul Preeth Singh

2011లో `కేరటం` అనే చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది రకుల్. ఆ సమయంలో ఈ బ్యూటీని ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సందీప్‌ కిషన్‌తో కలసి నటించిన `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌` సినిమాతో హిట్‌ అందుకుంది. దీంతో అందరి చూపు ఈ బ్యూటీపై పడింది. అంతే వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్‌ హీరోల సినిమాలు కూడా వచ్చాయి. 
 

68
Rakul Preeth Singh

కేవలం 3ఏళ్లలోనే ఏకంగా 13 సినిమాల్లో నటించే అవకాశాలు రావడం విశేషం. ఓ రకంగా ఆ సమయంలో టాలీవుడ్‌ని ఊపేసింది రకుల్‌. స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. ఆది సాయి కుమార్‌ నుంచి, గోపీచంద్‌, మంచు మనోజ్‌, రామ్‌, రవితేజ, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, నాగచైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మహేష్‌బాబులతో కలిసి నటించింది. 

78
Rakul Preeth Singh

వీరితోపాటు నాగార్జునతో `మన్మథుడు 2`, నితిన్‌తో `చెక్‌`, వైష్ణవ్‌ తేజ్‌తో `కొండపొలం` చిత్రం చేసింది. కానీ ఆమెకి వరుసగా పరాజయాలు వెంటాడాయి. దీంతో టాలీవుడ్‌కి గుడ్‌ బై చెప్పిందీ హాట్‌ బ్యూటీ. బాలీవుడ్‌లో ఆఫర్లు రావడంతో అక్కడికి చెక్కేసింది. హిందీలో వరుసగా ఏడెనిమిది సినిమాలకు కమిట్‌ అయ్యింది. కానీ అక్కడ కూడా రకుల్ కి సక్సెస్‌ దక్కలేదు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో అలరించింది. కానీ తనకు సక్సెస్‌ రాలేదు. 
 

88
Rakul Preeth Singh

అయినా కెరీర్‌ని లాక్కొస్తుంది రకుల్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక హిందీ మూవీ `మేరి పత్న కా రీమేక్‌`, తమిళంలో `ఇండియన్ 2` చిత్రాలున్నాయి. కొత్త అవకాశాల కోసం వేచి చూస్తుంది. అయితే సినిమాలు పెద్దగా లేకపోవడంతో సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ జోరు కూడా తగ్గిపోయింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories